Begin typing your search above and press return to search.
దేశంలో ఉరి ఇప్పటివరకు ఎవరికి వేశారు? ఎందుకు?
By: Tupaki Desk | 20 March 2020 10:00 PM ISTనిర్భయ కేసులో నలుగురికి ఉరి పడడంతో ఇప్పుడు ఉరిశిక్షలపై మళ్లీ చర్చ మొదలైంది. అసలు భారత రాజ్యాంగం ఉరిశిక్ష గురించి ఏం చెప్పింది. దేశంలో ఇప్పటివరకు ఎంతమందికి ఉరి అమలైంది? 30 ఏళ్లలో దేశంలో ఎన్ని ఉరిశిక్షలు అమలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది.
దేశ రాజ్యాంగంలో పౌరులందరికీ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఇచ్చింది. అయితే మాన ప్రాణాలు తీస్తే నేరం నిరూపితమైతే ఉరిశిక్ష విధిస్తారు. ఒక వ్యక్తిని హత్య చేసినా.. హత్యకి కుట్ర పన్నినట్టు తేలినా ఉరిశిక్ష విధిస్తారు.
1980లో సుప్రీం కోర్టు అత్యంత క్రూరమైన కేసుల్లోనే ఉరిశిక్ష వేయాలని స్పష్టం చేసింది. జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ ఉరిశిక్షపై వెళ్లే హక్కునిచ్చింది. సుప్రీం తీర్పును సమీక్ష కోరే అవకాశం కల్పించింది. గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేయవచ్చు. అయితే సమీక్ష పిటీషన్, క్షమాభిక్ష పిటీషన్లు తిరస్కరిస్తే ఉరిశిక్ష అమలు అవుతుంది.
దేశంలో మొదటి ఉరిశిక్ష మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు వేశారు. కుట్రదారుడు నారాయణ్ ఆప్టేకి కూడా విధించారు. తర్వాత 1989 జనవరిలో ఇందిరాగాంధీ హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష వేశారు.
1995లో తమిళనాడులో ఆటోశంకర్ ను ఉరితీశారు. 2004లో పదేళ్ల బాలికను హత్యచేసిన కేసులో ధనుంజయ్ చటర్జీని కోల్ కతాలో ఉరితీశారు.
2010లో ముంబై 26/11 దాడుల కేసులో ఉగ్రవాది కసబ్ ను ఉరితీశారు. 2013లో పార్లమెంట్ దాడి కుట్రదారు అప్ఝల్ గురును ఉరితీశారు. 2015లో 1993 ముంబై బాంబుపేలుళ్ల కుట్రదారుడు యాకుబ్ మెమెన్ ను ఉరితీశారు.
ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నిర్భయ రేపిస్టులకు ఉరితీశారు. ఏపీలో 1993లో చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నేరస్థులకు ఉరిశిక్ష పడ్డా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు.