Begin typing your search above and press return to search.

నీరజ్ చోప్రాకు సెక్స్ లైఫ్, గర్ల్ ఫ్రెండ్ పై ప్రశ్నలు.. నెటిజన్ల ఫైర్

By:  Tupaki Desk   |   6 Sep 2021 1:30 PM GMT
నీరజ్ చోప్రాకు సెక్స్ లైఫ్, గర్ల్ ఫ్రెండ్ పై ప్రశ్నలు.. నెటిజన్ల ఫైర్
X
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాను దేశం మొత్తం అభినందించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ నుంచి సామాన్యుల వరకూ నీరజ్ క్రీడా నైపుణ్యాన్ని కొనియాడారు.

భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల్లో ఆయన కొన్ని అభ్యంతరక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 'సెక్స్ లైఫ్ గురించి', మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?' 'మీకు హగ్ ఇస్తారా?' వంటి ప్రశ్నలతో దుమారం రేపారు. ఓ ఇంటర్వ్యూలో అయితే సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేయడం దుమారం రేపింది.

కొన్ని మీడియా సంస్థలు మరీ చవకబారు ప్రశ్నలతో నీరజ్ చోప్రాను ఇబ్బంది పెట్టాయి. ఆసక్తి వ్యక్తిగతానికి మధ్య గీతను చెరిపేస్తూ అనవసరమైన.. అర్థం లేని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇప్పటికే ఆయనను గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగారు. ఆన్ లైన్ లోనే తనకు మీరు హగ్ ఇస్తారా? అని నిసిగ్గుగా అభ్యర్థించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నీరజ్ చోప్రా ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇంటర్వ్యూయర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

చరిత్రకారుడు రాజీవ్ సేథి ఇటీవల నీరజ్ చోప్రాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. సెక్స్ లైఫ్ పై నీరజ్ ను ప్రశ్నించాడు. 'నీరజ్ నీవింత సుందరమైన యువకుడివి కదా? మీరు మీ ట్రెయినింగ్ ను సెక్స్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తారు?' అని అడిగారు. ఈ ప్రశ్నకు నీరజ్ చోప్రా ఒకింత అసహనానికి గురయ్యారు. సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. 'సారీ సార్' అని ప్రశ్నను దాటవేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈలాంటి ప్రశ్నలతో తన మనసు నిండిపోయిందని అన్నారు. దీంతో ఇంటర్వ్యూయర్ కూడా కలుగచేసుకొని ఆయనకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు.

ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. ఇప్పటికే 5 లక్షల మందిపైగా చూశారు. సేథి ప్రశ్నపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.