Begin typing your search above and press return to search.
బాలయ్య.. మీ కోసం హిందూపురం వెయింటింగ్
By: Tupaki Desk | 25 May 2017 7:55 AM GMTరెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణించటం అంత ఈజీ కాదు. అందులోకి కీలకమైన సినిమా రంగంలోనూ.. అటు రాజకీయ రంగంలోనూ ఒకే సమయంలో కీలకంగా వ్యవహరిస్తూ బ్యాలెన్స్ చేసుకోవటం అంత ఈజీ కాదు. ఓపక్క ప్రత్యక్ష రాజకీయాలు.. మరోవైపు సినిమాల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉండటం.. రెండింటికి న్యాయం చేయటం కష్టమే. తాజాగా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ప్రముఖ సినీ హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
వరుస షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్న ఆయన.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని చూసి నెలలకు పైనే అవుతుండటం గమనార్హం. దీంతో.. నియోజకవర్గంలోని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ప్రజలు మాత్రమే కాదు.. పార్టీ నేతల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఎమ్మెల్యేను కలుసుకోవటం చాలా కష్టం కావటంతో చోటా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చే్స్తున్నారు. అలా అని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. సీఎంకు స్వయంగా బావమరిది కమ్ వియ్యంకుడైన బాలకృష్ణ మీద తమకున్న అసంతృప్తిని ఎవరూ బాహాటంగా బయటకు పెట్టలేదని పరిస్థితి నెలకొని ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ మధ్యన బాలయ్య పీఏ శేఖర్ ఎపిసోడ్ రచ్చ రచ్చగా మారటం.. చివరకుఈ ఇష్యూ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లి..అ తడిపై వేటు వేయటం తెలిసిందే. పీఏ శేఖర్ ఎపిసోడ్ తర్వాత నుంచి బాలయ్య అందుబాటులో లేని వేళ.. నియోజకవర్గాన్ని చూసేది ఎవరన్నది అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ మీద ఉన్న అసంతృప్తితో కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షాలు తమ ఎమ్మెల్యే మిస్ అయ్యారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం గమనార్హం. ఇదే తీరు కానీ కొనసాగితే బాలయ్యకు ఇబ్బందులేనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా మేలుకొని.. బాలయ్య నియోజకవర్గం మీద ఒక కన్నేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి.. తన కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హిందూపురం నియోజకవర్గం మీద ఎప్పటికి కన్నేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/