Begin typing your search above and press return to search.

ఐర్లాండ్ లో పెరుగుతున్న హిందూమతం

By:  Tupaki Desk   |   8 April 2017 6:50 AM GMT
ఐర్లాండ్ లో పెరుగుతున్న హిందూమతం
X
హిందూమతం అంటే ఆసియా దేశాల్లోనే ఎక్కువ. ఐరోపా దేశాల్లో చాలా పరిమితంగా ఉండే మతం అది. కానీ.. ఐర్లాండ్ లో మాత్రం కొన్నాళ్లుగా హిందూమతం విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఇంతకుముందు క్రిస్టియన్ దేశంగా గుర్తింపు ఉన్న ఐర్లాండ్ లో ఇప్పుడు హిందూ జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. గత అయిదేళ్లలో అక్కడ ఏకంగా హిందూ జనాభా 34 శాతం పెరిగింది.

ఐర్లాండ్ లో గత ఏడాది నిర్వహించిన జనాభా లెక్కల ఆధారణంగా తాజాగా అక్కడి గణాంకాలు వెల్లడించారు. దాని ప్రకారం అక్కడ హిందూ జనాభా 34 శాతం వృద్ధి చెందినట్లు తేలింది. అదేసమయంలో మొత్తంగా ఆ దేశ జనాభాలో కేవలం 3.8 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది.

ఐర్లాండ్ లో ఇప్పటికీ రోమన్ క్యాథలిక్కులే అధికంగా ఉంటారు. వారితో పాటు ముస్లింలు, చర్చి ఆఫ్ ఐర్లాండ్, ఆర్దోడాక్స్ క్రిస్టియన్, క్రిస్టియిన్, రెస్బిటేరియన్, హిందు, అపాస్టలిక్, పెంతెకోస్తులు ఉన్నారు. 37.3 లక్షల మంది రోమన్ క్యాథలిక్కులు ఉండగా.. ఆ తరువాత స్థానం ఉన్నది ఏ మతం కూడా ఆచరించనివారు. ఐర్లాండ్ లో ఏ మతాన్ని ఆచరించని జనాభా 4.7 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ ఐర్లాండ్ మొత్తం జనాభా ఎంతో తెలుసా.. 47 లక్షలు. అంటే జనాభాలో 10 శాతం ఏ మతాన్ని ఫాలో కావడం లేదన్నమాట.

అయితే.. ఇండియా - నేపాల్ వంటివి హిందువులు ఎక్కువగా ఉన్న దేశాలన్న సంగతి తెలిసింద. అలాగే.. మారిషస్, ఫిజి వంటి ద్వీపదేశాలు.. కొన్ని కరేబియన్ దేశాల్లోనూ హిందూ జనాభా ఎక్కువే. అయితే... అరబ్ ఎమిరేట్స్ లో కూడా సుమారు 22 శాతం హిందువులు ఉండడం విశేషం. అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని సురినాంలో కూడా 20 శాతానికి పైగా హిందువులు ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/