Begin typing your search above and press return to search.

పాక్‌ లో ఉద్రిక్త‌త‌..హిందువును న‌రికి చంపేశారు

By:  Tupaki Desk   |   9 March 2017 9:18 AM GMT
పాక్‌ లో ఉద్రిక్త‌త‌..హిందువును న‌రికి చంపేశారు
X
పొరుగు దేశ‌మైన పాకిస్థాన్‌ లో హిందువుల‌పై దాడులు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా బ‌లూచిస్థాన్ ప్రావిన్స్‌ లో గుర్తు తెలియ‌ని కొంద‌రు వ్య‌క్తులు ఓ హిందూ మ‌హిళ‌ను న‌రికి చంపారు. న‌సీరాబాద్ జిల్లాలోని బాబా కోట్ ప్రాంతానికి చెందిన జానియా కుమారిపై దాడి చేసి చంపేశారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మేంట‌న్న విష‌యం తెలియ‌లేదు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా త‌న సోద‌రిని అన్యాయంగా చంపేశార‌ని, ఇది ఆ ప్రాంతంలోని కొంద‌రు ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తుల ప‌నేన‌ని కుమారి సోద‌రుడు జాలోరామ్ ఆరోపించారు. హంత‌కులను క‌ఠినంగా శిక్షించాల‌ని, త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అత‌ను కోరాడు. ఇటీవ‌ల ఈ ప్రాంతంలో బెదిరింపులు పెరిగిపోయాయ‌ని జాలోరామ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇందులో భాగంగానే త‌న సోద‌రిని హ‌త్య చేశార‌ని వాపోయాడు.

ఇదిలాఉండ‌గా...కొద్దికాలం క్రిత‌మే పాకిస్తాన్ ప్రభుత్వం మైనార్టీలుగా ఉన్న హిందువుల హ‌క్కుల‌కు ప‌రిర‌క్ష‌ణ క‌ల్పించేందుకు చ‌ట్టం తీసుకువ‌చ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం హిందువుల‌పై దాడి జ‌రిపితే వేగంగా ద‌ర్యాప్తు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు వివ‌రించింది. ఇటీవ‌లే పాకిస్తాన్‌ లో మైనార్టీల‌యిన‌ హిందువుల వివాహాలను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ ఓ చారిత్రక జాతీయ చట్టాన్ని ఆమోదించింది. దాదాపు పది నెలల చర్చోపచర్చల తర్వాత ఈ బిల్లును పాక్ జాతీయ అసెంబ్లీ ఓకే చెప్పింది. ఇలా పాక్‌లో ప‌రిస్థితులు హిందువుల సంక్షేమానికి అనుకూలంగా మారుతున్నాయ‌నుకున్న స‌మ‌యంలో ఆ దేశంలో ఇలా హ‌త్య‌లు జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/