Begin typing your search above and press return to search.

ఆ కరెన్సీ నోటు నాన్ వెజ్ అట

By:  Tupaki Desk   |   1 Dec 2016 10:30 PM GMT
ఆ కరెన్సీ నోటు నాన్ వెజ్ అట
X
కరెన్సీ నోటుతో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇట్టే కొనేయొచ్చు. కానీ.. జేబులో ఉండే నోటుకు కూడా వెజ్.. నాజ్ వెజ్ లాంటి వ్యత్యాసాలు ఉంటాయా? అంటే అవునని చెబుతున్నారు. తాజాగా ఒక నోటు ఫ్యూర్ నాన్ వెజ్ అని తేల్చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రిటన్ లోని ఐదు పౌండ్ల నోటులో జంతువుల కొవ్వు కలిసి ఉంటుందని తేల్చి చెప్పటంతో ఈ నోటు ఇప్పుడు నాన్ వెజ్ నోటుగా మారింది.

దీంతో.. ఈ నోటును పట్టుకునేందుకు వెజిటేరియన్లు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఐదు పౌండ్ల నోటు మీద చర్చ తీవ్రంగా సాగి.. అసలు ఆ నోటు వెజ్జా? నాన్ వెజ్జా? అన్న సందేహం కలిగిన నేపథ్యంలో కలుగజేసుకున్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సదరునోటులో జంతు కొవ్వుతో తయారు చేస్తారని స్పష్టం చేసింది. తాజాగా చేసిన ఈ ప్రకటనతో.. పలు హిందూ దేవాలయాల్లో ఈ నోటును తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.

కరెన్సీ నోట్ల తయారీకి జంతు కొవ్వు వినియోగించటంపై హిందువులు.. శాఖాహారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాము జంతు హింసకు వ్యతిరేకమని.. ఇలా కొవ్వుతో నోట్లను ఎలా తయారు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. లీసెస్టెర్ లో హిందువులు పెద్ద ఎత్తున ఉంటారు. వీరంతా ఇప్పుడు 5 పౌండ్ల నోటుమీద ఫైర్ కావటమే కాదు.. దానిపై వార్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ నోటును రద్దు చేయాలని.. వినియోగంలో నుంచి దీన్ని తొలగించాలంటూ సంతకాల కార్యక్రమాన్ని షురూ చేశారు. మరీ విషయంపై అక్కడి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/