Begin typing your search above and press return to search.

ఇస్లామిక్ స్టేట్ కు కౌంటర్ రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   20 Jan 2016 1:28 PM IST
ఇస్లామిక్ స్టేట్ కు కౌంటర్ రెడీ అవుతోంది
X
ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రైవేటు సైన్యం ఒకటి రెడీ అవుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ యమకింకరుల భరతం పట్టేందుకు ఇండియా కేంద్రంగా ధర్మయుద్ధానికి ప్రయివేటు సైన్యం సిద్ధమవుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని హిందు స్వాభిమాన్ ప్రధాన కార్యాలయంలో రూపుదిద్దుకున్న ధర్మ సేనలో 1500 మంది సైనికులు ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధానికి తయారుగా ఉన్నారు. ఇక వారు కదనరంగంలోకి దూకడమే తరువాయి.

హిందూ స్వాభిమాన సంస్థ ఆధ్వర్యంలో ధర్మసేన పేరుతో ఈ ప్రయివేటు సైన్యం రెడీ అవుతోంది. ఇప్పటికే 50 శిక్షణ శిబిరాల్లో వీరు ఫుల్లుగా ట్రైనింగవుతున్నారు. ఈ క్యాంపుల్లో యువకులే కాకుండా పిల్లలు కూడా యుద్ధ విద్యలలో శిక్షణ పొందుతున్నారు. కత్తి యుద్ధాలు - ఇతర ఆధునియ ఆయుధాల వినియోగంలో ఈ శిక్షణ శిబిరాలలో శిక్షణ ఇస్తున్నారు.

కాగా పేరుకు ఇది ప్రయివేటు సైన్యమైనప్పటికీ, హిందూ సంస్థలు - ప్రభుత్వం అండదండలు వీటికి ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ధర్మసేన తన లక్ష్య సాధనలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.