Begin typing your search above and press return to search.

గాడ్సే వర్థంతి రోజున పొగిడేయాలంట

By:  Tupaki Desk   |   20 Oct 2015 6:07 AM GMT
గాడ్సే వర్థంతి రోజున పొగిడేయాలంట
X
ఇప్పటికే దేశ వ్యాప్తంగా గో మాంసం అంశంపై సాగుతున్న రచ్చ తెలిసిందే. సమాజంలో అలజడి సృష్టించే దిశగా హిందూనాయకత్వం ప్రయత్నిస్తుందని.. దీంతో సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు రోజురోజుకి ముదిరిపోతున్న పరిస్థితి. దీనికి తోడు దేశంలో ప్రజాస్వామ్య లక్షణాలు తగ్గిపోయి.. సం కొందరి ఇష్టాలకు.. అభిమతాలకు అనుగుణంగా నడవాలన్నడిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇంతకాలం ఎవరినైతే ద్వేషించార ఇప్పుడు వారిని అభిమానించేలా కొత్త కథల్ని వినిపిస్తున్న వైనం విస్మయకరంగా మారింది. జాతిపిత గాంధీని చంపేసిన గాడ్సేను కీర్తించే పాడు రోజులు మొదలయ్యాయా? అన్న సందేహం కలగక మానదు. జాతిపితను అత్యంత పాశవికంగా హత్య చేసిన గాడ్సే వర్థంతి నవంబరు 15న భారీగా నిర్వహించాలని హిందూ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది.

గాడ్సే వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బలిదాన్ దివస్ ప్రత్యేక కార్యక్రమాలని డిజైడ్ చేశారు. ఆల్ ఇండియా హిందూ మహాసభ గాడ్సే వర్థంతిని ఘనంగా నిర్వహించాలని సదురు సంస్థ భావిస్తోంది. ఈ సందర్భంగా గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే రాసిన పుక్తాన్ని అచ్చేసి.. పంపిణీ చేయటంతో పాటు రక్తదాన శబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరి. హిందూ మహాసఘ తాజాగా తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా మరెంత రచ్చకు దారి తీస్తుందో..?