Begin typing your search above and press return to search.
ఓవైసిని అరెస్టు చేస్తే రూ.22 లక్షలు: హిందూ నాయకుడు సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 1 Jan 2022 1:04 PM ISTహిందూ ధర్మకర్త కాళిచరణ్ అరెస్టుపై హిందూ నాయకుడు, న్యాయవాది కూలభూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీని అరెస్టు చేయాలని, ఆయనను అరెస్టు చేస్తే రూ.22 లక్షల రివార్డు ఇస్తానని అన్నారు. కాళి చరణ్ అరెస్టుపై గురుగ్రామ్ లోని పలు వీధుల్లో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూలభూషణ్ డిప్యూటీ కమిషనర్ నివాసం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ట్యాంక్ పార్క్ వద్ద వేలాది మంది హిందూ కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూలభూషన్ ఎంపీ ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మత పెద్దలను, దార్శనికులను జరిగిన అవమానాన్ని తాము భరించలేమని అన్నారు. ‘ప్రతీ ఒక్కరికి భావ స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ఓవైసీనీ పోలీసులు,. ప్రభఉత్వం ఎందుకు అరెస్టు చేయలేదు? ఒవైసీనీ పట్టుకున్న పోలీసు అధికారికి రూ.22 లక్షల రివార్డు ఇస్తాం’ అని అన్నారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సుశీల్ కుమార్ కు అందించారు. అయితే హైదరాబాద్ ఎంపీ ప్రసంగంలో హిందువులను బెదరించారని రైట్ వింగ్ కార్యకర్తలు ఆరోపించారు.
కాగా మహాత్మగాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కాళిచరణ్ ను అరెస్టు చేశారు. ‘రాజకీయాలు చేసి దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యం. మన కళ్లముందే 1947లో దేశ విభజన జరిగింది. దాంధీని తుపాకీతో కాల్చిన నాథూరాం గాడ్సేకు సెల్యూట్ చేస్తున్నా..’ అని అన్నారు. అయితే తమ అనుమతి లేకుండా ఆయన్ను అరెస్టు చేయడం అంతర్రాష్ట్ర ప్రొటోకాల్ ను ఉల్లంఘించడమే నంటూ మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేవ్వర్ దామ్ లోని ఓ అద్దెఇంట్లో మారుపేరుతో ఉన్న ఆయనను వేకువ జామున అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ సీఎం భఊపేశ్ బఘేల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మహాత్మగాందీనిని అవామనించిన వ్యక్తిని అరెస్టు చేసినందుకు సంతోషిస్తున్నారా..? అని ప్రశ్నించారు.
ఛత్తీస్ గఢ్ పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరమని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా వ్యాఖ్యానించారు. ఆంతర్రాష్ట్ర ప్రొటోకాల్ ను ఉల్లంఘించిందన్నారు. అయితే మహాత్మగాంధీపై చేసిన వ్యాఖ్యలకు తాను పశ్చాత్తాపపడడం లేదని, అప్పట్లో వల్లభాయ్ పటేల్ ను ప్రధాని కాకుండా అడ్డుకున్నారన్నారు. అయితే కాళి చరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత పోలీసులు అయనను అరెస్టు చేశారు.