Begin typing your search above and press return to search.

కేసీఆర్ మనమడు ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   1 March 2016 10:40 AM IST
కేసీఆర్ మనమడు ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు
X
తమపై వచ్చే వార్తలకు సంబంధించి ప్రముఖు ఫోన్ లో టచ్ లోకి వచ్చి వివరణ ఇవ్వటం మామూలే. తాజాగా అలాంటి పనినే చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు.. కేటీఆర్ కుమారుడు హిమాన్షు. యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తీస్తున్న షార్ట్ ఫిలింలో హీరోగా నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అనారోగ్యం కారణంగా ఈ సినిమాకు సంబంధించిన చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని.. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 22 నుంచి స్టార్ట్ అవుతుందంటూ వచ్చిన వార్తపై స్పందించిన హిమాన్షు.. సదరు పత్రిక ప్రతినిధికి ఫోన్ చేసి.. తనకు హీరోగా ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే కానీ.. చదువుకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో తాను ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించాడు.

ప్రస్తుతం చదువు.. పరీక్షల మీదనే తన దృష్టి అని.. సినిమాలో నటించాలన్న ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నాడట. ఏమైనా.. తన మీద వచ్చిన వార్తల్ని ఎవరో కొట్టిపారేసే బదులు.. తానే టచ్ లోకి వచ్చేసి.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా వెల్లడించటం చూస్తుంటే.. చిన్న వయసులో సీఎం మనమడు చాలా చలాకీగా ఉన్నట్లు అనిపించట్లేదు..?