Begin typing your search above and press return to search.
గవర్నర్ కి తప్పిన ఘోర ప్రమాదం !
By: Tupaki Desk | 14 Dec 2020 2:19 PM ISTహిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివార్లలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. అయితే, డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా ఆపగలిగాడు. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. సూర్యాపేటలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. ఈ ప్రయాణానికి ముందు గవర్నర్ దత్తాత్రేయతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు.