Begin typing your search above and press return to search.

ఈమొయిల్ తో హిల్లరీ క్లింటర్ అరెస్ట్..?

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:31 PM GMT
ఈమొయిల్ తో హిల్లరీ క్లింటర్ అరెస్ట్..?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల సన్నాహాల్లోనే సంచలనం చోటు చేసుకుంది. రిపబ్లిక్స్ తరఫున అధ్యక్ష బరిలోకి దిగాలని భావిస్తున్న మొత్తం 17 మంది పోటీ పడుతున్నా.. అధ్యక్ష అభ్యర్థిగా ముందున్న కొద్దిమందిలో భారత మూలాలున్న బాబీ జిందాల్ ఒకరు. లూసియానా గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన.. తన పార్టీ వారితో పోటీ పడుతునూ.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా భావిస్తున్న హిల్లరీ క్లింటన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఆమెను విమర్శించే ఏ చిన్న అవకాశాన్ని బాబీ జిందాల్ వదిలి పెట్టటం లేదు. తాజాగా ఆమెపై ఆయన సంచలన వ్యాఖ్యలు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హిల్లరీకి సంబంధించిన తన దగ్గర ఉన్న ఆధారాల్లో ఒక్క మొయిల్ ను పంపితే.. హిల్లరీ క్లింటర్ అరెస్ట్ కావటం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. బాబీ జిందాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఇంతకీ ఆయన దగ్గరున్న అంత పెద్ద ఆధారాలేమిటని చూస్తే.. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని వ్యక్తిగతంగా వాడుకున్నారని.. హిల్లరీ క్లింటర్ స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లను సర్వర్ల నుంచి తీసుకున్నారన్నది బాబీ జిందాల్ ఆరోపణ. దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

మరోవైపు.. హిల్లరీ క్లింటన్ తరఫు అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎలాంటి అధికారిక దుర్వినియోగానికి పాల్పడలేదని.. కావాలంటే తమ సర్వర్ ను తనిఖీ చేసుకోవాల్సింది చెబుతున్నారు. మరి.. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.