Begin typing your search above and press return to search.

ఓట‌మిపై హిల్ల‌రీ ఇంటర్వ్యూ ఏం చెప్పారంటే..

By:  Tupaki Desk   |   4 Jun 2017 10:17 PM IST
ఓట‌మిపై హిల్ల‌రీ ఇంటర్వ్యూ ఏం చెప్పారంటే..
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం కొద్ది తేడాలో కోల్పోయిన హిల్లరీ క్లింటన్‌.. ఆ నాటి తన ఓటమికి దారితీసిన పరిస్థితులపై తొలిసారి స్పందించారు. డెమెక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగిన హిల్లరీ అప్పట్లో ఫేవరెట్‌ గా నిలిచారు. హిల్లరీయే గెలవచ్చని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల చివరి దశలో సీన్‌ ఛేంజ్‌ అయ్యింది. ఎన్నికల ఫలితాల్లో హిల్లరీ స్వల్ప తేడాతో ఓడిపోయారు.

రిప‌బ్లిక‌న్ పార్టీ నేత‌ డొనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ ఓటమి సంచలనం రేపింది. దీనిపై డెమెక్రాటిక్ పార్టీ నేతలు సహా హిల్లరీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐతే హిల్లరీ మాత్రం ఈ అంశంపై ఎప్పుడూ స్పందించలేదు. తొలిసారిగా ఈ ఓ ఇంటర్వ్యూలో తన ఓటమికి కారణాలు చెప్పారు హిల్లరీ. తప్పుడు ప్రచారంలో ఆరితేరిన రష్యా వల్లే పరాజయం పాలైనట్లు ఆమె చెప్పారు. పోలింగ్‌ వివరాలు, ఇతర సమాచారం రష్యాకు చేరవేడయంలో ట్రంప్‌ అనుచరులు సాయపడ్డారని ఆరోపించారు. ట్రంప్‌ ప్రచార బృందం, సహచరులకు ఎన్నికల ముందు, అనంతరం రష్యాతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయని...అన్నీ బహిర్గతమైతే సహకరించిన వారి వివరాలు బయటకొస్తాయని చెప్పారు. ఈ–మెయిల్‌ వివాదాన్ని పెద్ద తప్పుగా మీడియా అనవసర రాద్దాంతం చేసిందని హిల్లరీ విమర్శించారు. దీనిపై ఎఫ్‌.బి.ఐ విచారణ సైతం ఓటమికి కారణమని హిల్లరీ చెప్పారు.

అయితే హిల్లరీ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు. మోసకారి అయిన హిల్లరీ తన ఓటమికి ప్రతిఒక్కరిని నిందిస్తున్నారని ఫైరయ్యారు. తాను భయంకరమైన అభ్యర్థినని మాత్రం చెప్పడం లేదని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. తన ప్రచార బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని కల్పించి డొమొక్రాటిక్‌ పార్టీ ఓటమికి సాకులు చెబుతోందని మండిపడ్డారు. డొమొక్రాటిక్‌ పార్టీ చెప్పిన సాకు చూసి రష్యా కచ్చితంగా నవ్వుకుని ఉండొచ్చని ట్రంప్ చ‌మ‌త్క‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/