Begin typing your search above and press return to search.

హిజాబ్ వివాదం: సంప్రదాయాలు.. ఆధునికత.. ఏది రైట్?

By:  Tupaki Desk   |   17 March 2022 1:30 PM GMT
హిజాబ్ వివాదం: సంప్రదాయాలు.. ఆధునికత.. ఏది రైట్?
X
కొన్ని నెలలుగా కర్ణాటకను, దేశాన్ని ఊపేస్తోన్న హిజాబ్ వివాదానికి 'కర్ణాటక హైకోర్టు' ఓ ముగింపునిచ్చింది. అయితే ఈ తీర్పు నచ్చని కొందరు సుప్రీంకోర్టు గడప తొక్కారు. తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉడిపిలోని ముస్లిం విద్యార్థినులలో ఒక వర్గం దాఖలు చేసిన పిటీషన్ ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. పాఠశాల యూనిఫాం ప్రిస్కిప్షన్ సహేతుకమైన పరిమితి మాత్రమేనని.. విద్యార్థులు అదే పాటించాలని సూచించింది. హిజాబ్ ఇస్లాంలో ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని త్రిసభ్య దర్మాసనం పేర్కొంది.

జనవరి 1న ఉడిపిలోని ఒక కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతి గదిలోకి ప్రవేశించడానికి కళాశాల అధికారులు నిరాకరించారు. ఎప్పుడూ కండువాలు తొలగించి తరగతి గదిలోకి ప్రవేశించారని కాలేజీ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ తెలిపారు. గత 35 ఏళ్లలో ఎవరూ దానిని తరగతి గది వరకూ తీసుకురాలేదని.. బయట వారి మద్దతుతో విద్యార్థులు ఇలా చేశారని చెప్పారు.

భారత రాజ్యాంగం వారి మత ఆచారాలను పాటించడానికి హక్కులు కల్పించింది. ఒఖ సన్యాసి కాషాయం ధరించి ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా చేస్తున్నారు. ఒక ఎంపీ అయిన ముస్లిం తలపై టోపీ పెట్టుకొని పార్లమెంట్ కు హాజరువుతున్నారు. ఇలా ఎవరి ఆచారం వారిది. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించవచ్చు. ఇది వారి ఆచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చింది.

హిజాబ్ ను వాడడానికి ఎవరూ అభ్యంతరం తెలుపలేదు. కానీ ఒక అతివాద వర్గం ప్రోత్సాహంతో ఇన్నాళ్లు తరగతి గదిలో వాడని ముస్లిం విద్యార్థినులు తాజాగా వాడడంతోనే ఈ వివాదం చెలరేగింది. వారి మతంలో ఇది తప్పనిసరి అని లేదని హైకోర్టు తెలిపింది. వారి మతంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ రాచరిక మతాన్ని అవలంభించడం ఇప్పటి ఆధునిక యుగానికి సూట్ కావు.

ఈ మేరకు విద్యార్థులు కూడా ఆధునికతగా మారి.. పాత సంప్రదాయాలను విడనాడాలని.. హైకోర్టు సూచనలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. ఇక సంప్రదాయ విషయంలో కఠువుగా ముందుకెళ్లవద్దని విద్యార్థినులకు సూచిస్తున్నారు