Begin typing your search above and press return to search.
దుబాయ్ లో మోడీ ఏం చెప్పారు..?
By: Tupaki Desk | 18 Aug 2015 9:28 AM ISTదాదాపు 55 వేల మంది భారతీయుల్ని ఉద్దేశించి దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మోడీ ఏం చెప్పారు? ఆయనేం చెబుతారని.. భారతీయులు అంత పెద్ద ఎత్తున తరలివెళ్లారు? మోడీ మాటల్లో దుబాయ్ లోని భారతీయులకు ఏమైనా ప్రయోజనం ఉందా? వారికి మేలు కలిగించే అంశాల్ని మోడీ ప్రస్తావించారా? ఇంతకీ దుబాయ్ స్టేడియంలో కిక్కిరిసిన జనసందోహాన్ని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం ఏం చెప్పింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే..
కాసింత భావోద్వేగం.. మరికాస్త రాజకీయం.. కలగలిపి తియ్య తియ్యటి మాటలతో.. మనసును టచ్ చేసేలా చెప్పే ప్రధాని మోడీ.. తన మాటల మేజిక్ ను మరోసారి దుబాయ్ సాక్షిగా ప్రదర్శించారు. ఒక ముస్లిం దేశంలో.. ఒక హిందూ దేవాలయానికి అనుమతి సాధించటం ఒక విజయమైతే.. దాన్ని సభికులకు సందర్భానుసారంగా చెప్పి.. రక్తి కట్టించారు. నిజానికి యూఏఈలో దేవాలయాన్ని నిర్మించాలన్న అనుమతికి మోడీ గొప్పతనం కంటే కూడా యూఏఈ రాజు పెద్ద మనసుగానే చెప్పాలి. కాకపోతే.. ఆ దిశగా అడుగులు వేయాలని ఆలోచించి.. ఒప్పించటం కూడా అంత చిన్న విషయమేమీ కాదు. మొత్తానికి దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఓకే చెప్పటం ఒక పరిణామంగా చెప్పాలి. కాకపోతే.. ఇదంతా మోడీ గొప్పతనంగా ఆయన అకౌంట్ లో పడే అవకాశమే ఎక్కువ.
ఎక్కడ ఎలా మాట్లాడితే వర్క్ వుట్ అవుతుందో.. వారి మనసును గెలుచుకుంటానో మోడీకి బాగా తెలుసు. ఉగ్రవాదం గురించి నవ్వుతూ మాట్లాడటం మోడీకే చేతనవుతుందేమో. ఆయన మాటలకు కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేయించే మేజిక్ మోడీకే చెల్లుతుంది. ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదానికి మద్ధతు ఇచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రెండు దేశాలు నిర్ణయించాయని..దాన్ని సమర్థించే దేశాలకు స్పష్టమైన హెచ్చరిక అవుతుందని.. ఇక్కడ ఇచ్చిన సంకేతాలు వారికి అర్థమవుతాయని మోడీ పాకిస్థాన్ కు నర్మగర్భంగా వార్నింగ్ ఇవ్వటాన్ని గుర్తించిన సభికులు కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తన బంగ్లాదేశ్ పర్యటనలో పాక్ పై నేరుగా విమర్శలు చేసిన మోడీ.. దుబాయ్ లో మాత్రం పరిమితుల కారణంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం కారణంగా ఎంతో మంది అమాయకులు మరణిస్తున్నారన్న మోడీ.. హింసా మార్గాన్ని ఎంచుకున్న దేశాలు.. వ్యక్తులు చర్చలకు రావాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని.. చర్చలు మాత్రమే సమస్యకు పరిష్కారంగా తేల్చారు.
ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మోడీ.. ఐక్యరాజ్యసమితి మీద కూడా విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని.. ఏ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనే విషయాలను భద్రతా మండలి నిర్ణయించకపోవటాన్ని ప్రశ్నించిన మోడీ.. ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు నిర్వహణ ఎంతోకాలంగా పెండింగ్ లో ఉందని.. దాని నిర్వాహణకు భారత్.. యూఏఈలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని చెప్పుకున్న ప్రధాని.. విదేశాంగ విధానం విషయంలో తమ సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని ప్రత్యేకంగా చెప్పుకున్నారు. సార్క్ దేశాల మధ్య గతంలో గొడవలు మాత్రమే ఉండేవని.. సార్క్ సదస్సు వేదిక పోట్లాటలకు నిలయంగా ఉండేదని.. దాని రూపురేఖలు మార్చిన ఘనత తమదేనని చెప్పుకున్నారు. తమ విజయాలను.. విపక్షాల అపజయాల్ని ప్రజల మనసుల్ని తాకేలా ప్రసంగించటంలో మోడీ విజయవంతం అయ్యారని చెప్పొచ్చు.
భారత్ లో తమ సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో తాము అధికారంలోకి వచ్చే వరకూ కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేవని.. కానీ.. జీరో బ్యాలెన్స్ తో తాము ఖాతాలు తెరిపించటంలో విజయవంతం అయ్యామని చెప్పిన మోడీ.. ఈ సందర్భంగా నెలకు ఒక్కో వ్యక్తికి రూపాయి చొప్పున చెల్లిస్తే రూ.2లక్షల బీమా ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. జీవన్ సురక్షా యోజన పథకాన్ని అమలు చేస్తున్నామని.. దుబాయ్ లోని భారతీయులు.. భారత్ లోని తమ వారి ఖాతాల్లో రూ.600డిపాజిట్ చేయాలని పిలుపునిచ్చారు. రాఖీ సందర్భంగా అక్కా చెల్లెళ్లకు ఇచ్చే కానుకగా భావించాలన్నారు.
ఉగ్రవాదంతో పాటు.. భారత్ లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మోడీ.. యూఏఈ యువరాజు భారత్ లో 4.5లక్షల కోట్ల పెట్టుబడులు పెడతానని చెప్పినట్లుగా ప్రకటించారు. ఇక.. భారత విదేశాంగ విధానాన్ని సైతం సునిశితంగా విమర్శించారు. విదేశీ గడ్డ మీద భారత్ గత ప్రభుత్వాల వైఖరిని విమర్శించటం మోడీకి కొత్త కాదు. గతంలో ఇదే అంశంపై పలు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. మోడీ మాత్రం వేయాల్సిన చురకలు వేసేశారు. స్వదేశంలో తక్కువ.. విదేశంలో ఎక్కువగా ప్రధాని ఉంటున్నారంటూ విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు.. తన విదేశీ పర్యటనల లక్ష్యాన్ని చెప్పుకునే మోడీ.. తాజాగా యూఏఈ పర్యటనను సమర్థించుకున్నారు.
భారత్ లోని గత పాలకుల లోపాల కారణంగా పెట్టుబడుల రాక మందగించిందని విమర్శించిన మోడీ.. అందుకు ఓ ఉదాహరణను చెప్పుకొచ్చారు. యూఏఈకి భారత్ కు మధ్య వారానికి 700 విమానాలు నడుస్తుంటాయని.. కానీ.. భారత ప్రధాని యూఏఈ రావటానికి మాత్రం 34 ఏళ్లు పట్టిందని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్య ఒకటి చేశారు. ‘‘ఈ ఆలస్యానికి నేను సిగ్గుపడుతున్నా’’ అని వ్యాఖ్యానించారు.