Begin typing your search above and press return to search.
జగన్ అనే నేను.. హైలెట్స్ ఇవే..
By: Tupaki Desk | 30 May 2019 1:21 PM ISTవైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదేళ్ల కలను నెరవేర్చుకున్నారు. ‘వైఎస్ జగన్ అనే నేను’ గద్గద.. ఆనంద స్వరంతో గొంతెత్తి ప్రమాణం చేశారు. వైఎస్ జగన్ అనే నేను అనగానే ప్రమాణ స్వీకార వేదిక అరుపులతో ఊగిపోయింది. ఈ మాట కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జగన్ కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కొద్దిసేపు అలానే జనసందోహాన్ని చూస్తూ ఉండిపోయారు..
ముఖ్యమంత్రి జగన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులకు తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ లు హాజరయ్యారు..
*ప్రధాన హైలెట్స్ ఇవే..
*మధ్యాహ్నం 12 గంటలకు జగన్ తన తాడేపల్లి ఇంటి నుంచి ప్రమాణ స్వీకార వేదికకు బయలు దేరారు. ఆయన వెనుకాలే వైఎస్ విజయమ్మ వచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెనుక కార్లలో వేదికకు వచ్చేశారు.
*జగన్ ఇందిరాగాంధీ స్టేడియంలోకి రాగానే పూలవర్షం కురిపించారు. సొంతంగా హెలిక్యాప్టర్ సమకూర్చిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జగన్ పై, ప్రజలపై పూలవర్షం కురిపించారు.
*అందరికీ నమస్కరిస్తూ జగన్ వేదికపైకి వచ్చాడు. అంతకు కొద్ది సేపటి ముందు కేసీఆర్, స్టాలిన్ లు వేదికమీదకు వచ్చారు.
*జగన్ వేదికపైకి రాగానే ప్రజలకు కేసీఆర్, స్టాలిన్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ అభివాదం చేశారు.
* ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ వచ్చారు. జాతీయ గీతం ఆలపించాక ప్రమాణ స్వీకారం జరిగింది. జగన్ చేత సీఎంగా నరసింహన్ ప్రమాణం చేశారు..
*ఆ తర్వాత గవర్నర్ కేసీఆర్, స్టాలిన్ లను, జగన్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు..
*గవర్నర్ వెళ్లాక స్టాలిన్ మొదట మాట్లాడారు. రెండే ముక్కల్లో జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ క్లుప్తంగా మాట్లాడారు. తెలుగు వారు కలిసి ఉంటే కలదు సుఖమని.. గోదావరి, కృష్ణా నీళ్లను వాడుకొని రెండు రాష్ట్రాలు సౌభాగ్యంగా ఉండాలని కోరారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్.. పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని కోరారు.
*కేసీఆర్ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడారు.