Begin typing your search above and press return to search.
ఏపీలో పని చేస్తూ హైదరాబాద్ ఇంటిని అధికార నివాసంగా అడగటమా నిమ్మగడ్డ?
By: Tupaki Desk | 4 Nov 2020 3:20 PM ISTతన ముందుకు వచ్చిన ఒక వ్యాజ్యం విషయంలో ఏపీ హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఇదెలా అన్న ప్రశ్నను సంధించింది. ఇంతకూ విషయం ఏమంటే.. ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్.. హైదరాబాద్ లోని తన ఇంటిని అధికారిక నివాసంగా భావించాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం విస్మయాన్ని వ్యక్తం చేసింది.
ఇలా కోరటం వింతగా.. విచిత్రంగా ఉందని పేర్కొంది. ఏపీకి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నప్పుడు.. హైదరాబాద్ లోని ఇంటిని అధికారికంగా భావించాలని కోరటం ఏ మాత్రం అర్థం కానిదిగా ధర్మాసనం స్పష్టం చేసింది.వ్యవస్థలే శాశ్వితం తప్పించి.. ఆయా హోదాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్న కోర్టు.. ఆర్థిక.. ఆర్థికేతర అంశాలకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న విషయాన్ని నోట్ రూపంలో ఇవ్వాలని కోర్టు పేర్కొంది. మరి.. దీనిపై నిమ్మగడ్డ వారు ఎలా స్పందిస్తారో చూడాలి. అయినా.. ఏపీలో ఉంటూ.. హైదరాబాద్ లోని ఇళ్ల మీద అంతలా ప్రాధాన్యత ఇవ్వటమా నిమ్మగడ్డ?