Begin typing your search above and press return to search.

మైసూరాకు నోట మాట రాలేదా?

By:  Tupaki Desk   |   29 Nov 2016 3:12 PM IST
మైసూరాకు నోట మాట రాలేదా?
X
ఇరుకున పెట్టాలనుకున్న వారు ఇరుకున పడితే ఎలా ఉంటుందన్న అనుభవం సీనియర్ రాజకీయ నేత మైసూరారెడ్డికి స్వయంగా అనుభవంలోకి వచ్చిన ఉదంతమిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలంటే.. చిన్నపాటి లిటిగేషన్ ను తెరపైకి తీసుకొచ్చి.. పిటీషన్ ను కోర్టులలో దాఖలు చేస్తున్న వైనం కనిపిస్తుంది. అధికారపక్షం స్పీడుకు బ్రేకులు వేసేలా పలువురునేతలు కోర్టుల్ని ఆశ్రయిస్తున్న వైనం రోజూ చూస్తున్నదే.

తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి.. తెబ్బ ఇబ్బందిపడ్డారట మైసూరా. నల్లధనం అంతు చూడాలన్న ఉద్దేశంతో పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ పుణ్యమా అని గడిచిన మూడు వారాలుగా కరెన్సీ నోట్ల మీద చర్చ మినహా మిగిలిన విషయాల్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దేశంలోని ప్రజలందరికి కరెన్సీ నోట్లను బ్యాంకుల నుంచి.. ఏటీఎంల నుంచి తెచ్చుకోవటం ఇప్పుడో పెద్ద పనిగా మారింది.

ఇలాంటి వేళ.. నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. మైసూరారెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై వాదనలు ఈ రోజు జరిగాయి. ఈ సందర్భంగా మైసూరారెడ్డి తరఫు న్యాయవాదులు చేసిన వాదనకు స్పందించిన హైకోర్టు ధర్మాసనం..నోట్ల రద్దు కారణంగా కొంత ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వం ముందే చెప్పింది కదా? అని ప్రశ్నించింది.

దేవంలో లెక్కలోకి రాని సొమ్మును ఎంతుందో తెలుసుకోవటమే ప్రభుత్వ లక్ష్యమన్న న్యాయస్థానం.. పెద్దనోట్ల రద్దుకారణంగా మీ వ్యక్తిగత ఇబ్బంది ఏమిటో చెప్పాలంటూ మైసూరా తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. ఊహించని విధంగావచ్చిన ఈ ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేసిందని చెబుతున్నారు. హైకోర్టు నుంచి ఈ తరహా ప్రశ్న వస్తుందని ఏ మాత్రం ఊహించని మైసూరా అండ్ కో.. ఉలిక్కిపడిందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/