Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసీఆర్ బీజేపీకి షాక్.. సీబీఐకి కేసు ఇవ్వమన్న హైకోర్టు

By:  Tupaki Desk   |   15 Nov 2022 11:30 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసీఆర్ బీజేపీకి షాక్.. సీబీఐకి కేసు ఇవ్వమన్న హైకోర్టు
X
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈ కేసును విచారిస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదని.. కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ పార్టీ వేసిన పిటీషన్ ను తోసిపుచ్చింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన తుది నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

-నిందితులకు నో బెయిల్

ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి ఏసీబీ కోర్టు నిరాకరించింది. వారి పిటీషన్ ను కొట్టివేసింది. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ప్రభుత్వ అడ్వకేట్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో బెయిల్ ను నిరాకరించింది.

మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేస్తూ పట్టుబడ్డ ముగ్గురు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఒకబ్రోకర్, ఇద్దరు స్వామీజీలు బెయిల్ దక్కకపోవడంతో జైల్లో ఉంటున్నారు..

ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం థ్రెట్ దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వంను కూల్చేందుకు వచ్చినా అమ్ముడుపోకుండా నిలబడ్డ ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిసింది.

ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి స్వామి అనే ముగ్గురికి జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు. ఏసీబీ కోర్టు వీరి బెయిల్ రద్దు చేయగా.. హైకోర్టు వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.