Begin typing your search above and press return to search.
టీడీపీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు.. హైటెన్షన్
By: Tupaki Desk | 16 May 2020 2:00 PM ISTతూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నాయకుల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం.. ఘర్షణకు దారి తీసింది.
రాజమండ్రి రూరల్ ప్రాంత పేదలకు ఇళ్ల స్థలాల కోసం కోరుకొండలో ఆవ భూముల సేకరణను అధికార వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ భూముల సేకరణ వివాదాస్పదమైంది. ఏడాదిలో దాదాపు ఆరు ఏడు నెలలపాటు ముంపునకు గురై నీటిలోనే ఉండే ఈ ప్రాంతాలను పేదల ఇళ్ల కోసం సేకరించడంపై ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యంతరం తెలిపింది. దీనిపై పోరు బాట పట్టింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు టీడీపీ బృందం శనివారం ఈ ప్రాంతంలో పర్యటించింది.
టీడీపీ సీనియర్ నాయకులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, జ్యోతుల నెహ్రూ, అప్పారావు తదితరులు కోరుకొండకు చేరుకొని ఆవ భూములను పరిశీలించారు. లోతట్టు ప్రాంతంలో 42వేల పేద కుటుంబాలకు ఇళ్లస్తలాలిస్తే అవి మునిగిపోవా అని ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం అనువు కాదని.. ప్రభుత్వం విరమించుకోవాలని ఆందోళన చేశారు.
ఇక ఈ భూముల పేరుతో కోట్లు చేతులు మారాయని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కాగా టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ నేతలు వాహనాలు వదిలి కాలినడకన స్థలాలు పరిశీలించేందుకు వెళ్లడంతో అక్కడ హైటెన్సన్ నెలకొంది.