Begin typing your search above and press return to search.

100 మంది పోలీసులు.. రాజాసింగ్ ఇంటి వద్ద టెన్షన్

By:  Tupaki Desk   |   7 Nov 2020 10:01 PM IST
100 మంది పోలీసులు.. రాజాసింగ్ ఇంటి వద్ద టెన్షన్
X
హైదరాబాద్ లోని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం లేదని .. వరద సాయం తన వర్గం వారికి ఇప్పించుకున్నారని గోషామహల్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు రాజాసింగ్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.

రాజాసింగ్ కు ఇప్పటికే టెర్రరిస్టుల నుంచి ముప్పుపొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే ఆయనకు పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

కాంగ్రెస్ నాయకులు రాజాసింగ్ ఇంటి ముట్టడికి ప్రజా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు.

దాదాపు 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

అయితే రాజాసింగ్ మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వరదల సాయంలో విఫలమైందని ఆరోపించారు. ప్రకటించిన రూ.10వేల సాయాన్ని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు పంపుతున్నారని ఆరోపించారు. కొందరు కావాలనే నాపై బురద జల్లడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.