Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి రికార్డు స్థాయి భద్రత!

By:  Tupaki Desk   |   5 Nov 2016 10:52 AM GMT
చంద్రబాబుకి రికార్డు స్థాయి భద్రత!
X
సాదారణంగా వై కేటగిరీ - జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వీఐపీలకు - వీవీఐపీలకు ఆయాపరిస్థితులను బట్టి ఉంటూ ఉంటుంది! అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రిపై మావోయిస్టుల ఆత్మాయుతి దాడుల హెచ్చరికల నేపథ్యంలో మునుపెన్నడూలేని స్థాయిలో భద్రత కల్పించారు. ఈ భద్రతా వలయానికి ఏమి పేరు పెట్టారనేది తెలియదు కానీ...అసాధారణ రీతిలో మాత్రం భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి కర్నూలులో సీఎం పాల్గొనబోతున్న పాదయాత్ర వేదికైంది!

కర్నూలులో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్న పాదయాత్రకు పోలీసులు అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. బాబు రక్షణ కోసం సుమారు 600 మంది పోలీసులు - 150 మందితో కూడిన సాయుధ రక్షక సభ్యులు భద్రత కల్పిస్తున్నారు. ఈ పాదయాత్ర కర్నూలులో సుమారు 3 కిలోమీటర్ల మేర సాగనుంది. అనంతరం కోల్స్ కళాశాల మైదానంలో జన చైతన్యయాత్ర సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. దీంతో పాదయాత్ర చేసే మార్గం తో పాటు ఈ మైదానంలోనూ భారీస్థాయి భద్రతను బాబుకు ఏర్పాటుచేశారు.

అంతే కాకుండా చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో రెండు డ్రోన్ కెమెరాలతో పాటు సుమారు 150 సిసి కెమెరాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటిద్వారా నిత్యం సీఎం భద్రతను అధికారులు పర్యవేక్షించనున్నారు. పాదయాత్ర నిర్వహించే రహదారులతో పాటు అటు ఇటూ సుమారు అర కిలోమీటర్ పరిధిలో ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు డీఎస్పీలను కంట్రోల్ రూంలో నియమించి ప్రతిక్షణం తగిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసే ప్రాంతంతో పాటు, బహిరంగ సభ జరిగే ఏరియా మొత్తం ఇప్పటికే పోలీసు జాగిలాలు, బాంబు డిస్ఫ్యూజింగ్ స్క్వాడ్ తనిఖీలు చేశాయి. పాదయాత్ర అనంతరం సీఎం పాల్గొనే కార్యక్రమంలో హాజరయ్యే ప్రజలను పూర్తిస్థాయిలో చెక్ చేసి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/