Begin typing your search above and press return to search.

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆస్పత్రి వద్ద హైడ్రామా .!

By:  Tupaki Desk   |   7 Dec 2019 9:45 AM GMT
మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆస్పత్రి వద్ద హైడ్రామా .!
X
దిశ నిందుతుల ఎన్ కౌంటర్ తో మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆస్పత్రి వద్ద నిన్న పెద్ద టెంక్షన్ వాతావరణం నెలకొంది. రంగారెడ్డి షాద్‌నగర్‌ చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాలకు మహబూబ్‌ నగర్‌ జిల్లాస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని ప్రసార మాద్యమాల్లో తెలుసుకున్న పాలమూరు ప్రజలు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున జిల్లాస్పత్రికి చేరుకున్నారు. దీనితో అక్కడికి వచ్చిన జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి.. ఇద్దరు డీఎస్పీలు పోలీసులతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

ఇక రెండు గంటల ప్రాంతంలో నిందితులకు ఎన్‌ కౌంటర్‌ స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. కానీ , మళ్లీ సాయంత్రం 3.10 గంటలకు జిల్లాస్పత్రికి చేరుకున్న ఎస్పీ మృతదేహాలను మహబూబ్‌ నగర్‌ కే తీసుకువస్తున్నారని.. అందరూ సిద్ధంగా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న సాధారణ జనంతో పాటు మీడియాను సైతం ప్రధాన గేటు బయటికి పంపించేశారు. ఆస్పత్రి అంతా పోలీసుల హడావిడి మొదలవడం..మీడియా రోడ్డు పైకి రావడంతో ఆ మార్గాన వెళ్లే ప్రతి ఒక్కరు కూడా దిశ ని అంత క్రూరంగా చంపేసిన వారి శవాలని చూడాలని అక్కడే ఆగిపోయారు.

ఎన్‌ కౌంటర్‌ లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు తీవ్ర ఉత్కంఠతో పోలీసులు ఎదురుచూసారు. సాయంత్రం 4 తరువాత హాస్పిటల్ కి శవాలని తీసుకొచ్చిన పోలీసులు .. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం పూర్తయినట్టు ప్రకటించారు. ఎన్‌ కౌంటర్‌ లో చనిపోయిన ‘దిశ’ నిందితుల పోస్టుమార్టం ఉమ్మడి జిల్లా పోలీసులకే కాదూ హైదరాబాద్‌ నుంచి వచ్చిన పోలీసు అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠతో పోలీసులు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించారు.