Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామ కు హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   28 Dec 2021 4:40 AM GMT
ఎంపీ రఘురామ కు  హైకోర్టు షాక్
X
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. విచారణ సందర్భంగా ఎంపీతో పాటు ఆయన లాయర్ పైన కూడా తీవ్రంగా మండిపోయింది. రాజకీయ, వ్యక్తిగత కక్షలకు హైకోర్టును వేదికగా మార్చుకుంటారా అంటు మండిపడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన ఎంపి అందుకు ఒక్క కారణాన్నైనా చూపించారా ? అంటు నిలదీసింది.

సాక్ష్యులను జగన్ ప్రభావితం చేస్తున్నారని, భయపడెతున్నారని పదే పదే ఆరోపిస్తున్న ఎంపీ తన వాదనకు మద్దతుగా ఒక్క సాక్ష్యాన్ని అయినా చూపించారా అంటు ఫుల్లుగా ఫైరయిపోయింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా వ్యక్తిగత కక్షతో జగనే బెయిల్ రద్దుచేయాలని కేసు వేయటం ఏమిటని ప్రశ్నించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ కు బెయిల్ ఇచ్చిన 8 ఏళ్ళకు బెయిల్ రద్దు చేయాలన్న పిటీషన్ ఎందుకు వేయాల్సొచ్చిందని ఎంపీని నిలదీసింది.

అసలు జగన్ బెయిల్ రద్దుకు ఎంపీకి సంబంధం ఏమిటని కూడా ప్రశ్నించింది. దీనికి ఎంపీ తరపున లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. జగన్ తరపున లాయర్ మాట్లాడుతు జగన్ తో పడని కారణంగానే ఇపుడు ఎంపీ బెయిల్ రద్దు పిటీషన్ వేసినట్లు జడ్జీ దృష్టి కెళ్ళారు. అప్పుడు వ్యక్తిగత పంచాయితీలను తీర్చుకునేందుకు కోర్టులను వేదికగా చేసుకుంటారా అంటు ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఇదే సమయంలో సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నట్లు కానీ లేదా భయపెడుతున్నట్లుగానే ఏమన్నా సాక్ష్యాలున్నాయా ? ఎవరి దగ్గరనుండైనా ఫిర్యాదులు అందాయా అన్నపుడు సీబీఐ లాయర్ అలాంటిదేమీ లేదన్నారు. దాంతో అసలు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేని ఎంపీ జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేయటం ఏమిటంటు ఆగ్రహంగా ప్రశ్నించింది. పిటీషన్ వేసేటపుడు తన వాదనకు తగ్గట్లుగా సాక్ష్యాలను చూపాల్సిన బాధ్యత పిటీషనర్ కు లేదా అంటు చురకలంటించింది.

ఇదే కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గతంలోనే ఎంపీ కేసును కొట్టేసిన విషయాన్ని జగన్ తరపు లాయర్ గుర్తుచేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ కు వ్యతిరేకంగా ఎంపీ కేసు వేసినట్లు ఆరోపించారు. దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ, అన్నీ విషయాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ ప్రత్యేక కోర్టు ఎంపీ పిటీషన్ను కొట్టేసుంటుంది కదా అంటూ అడిగారు. దానికి ఎంపీ తరపు లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.