Begin typing your search above and press return to search.

ఎంపీటీసీ - జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   19 Feb 2021 7:30 PM IST
ఎంపీటీసీ - జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు సంచలన నిర్ణయం
X
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ వీటిని మార్చిలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరుపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే ఆ ఫలితాలు వెల్లడించవద్దని.. నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

బలవంతపు ఏకగ్రీవాలపై సమీక్షిస్తామని ఎస్ఈసీ గతంలో చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ప్రభావం చూపే అవకాశం ఉంది. బెదిరింపులకు పాల్పడితే మళ్లీ నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై స్పష్టం వచ్చింది.