Begin typing your search above and press return to search.

ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

By:  Tupaki Desk   |   25 Feb 2021 9:00 PM IST
ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
X
దేశంలోనే అతిపురాతన ఆస్పత్రుల్లో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రి ఒకటి. వంద ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి భవనం కాలగర్భంలో కలిసిపోబోతోంది. బిల్డింగ్‌కు లీకేజీలు వస్తే రిపేర్లు చేయించకుండా.. మొత్తం నేలమట్టం చేసి కొత్తవి నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌‌ చెబుతుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

చివరి నిజాం పాలకుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ నిర్మించిన అతని పేరు మీదనే ఈ కట్టడం ప్రసిద్ధికెక్కింది. ఎంతో ఘన కీర్తి.. ఎంతో చరిత్ర.. ఎందరో ప్రాణాలు కాపాడిన కలల సౌధం ఇప్పుడు కరిగిపోతోంది. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌‌ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. అప్పటి దుస్థితిని చూసి పాత బిల్డింగ్‌ను తొలగించి అత్యాధునిక హంగులతో రెండు టవర్లు నిర్మిస్తామని ప్రకటించారు. అంటే.. అప్పటి నుంచే ఉస్మానియా కట్టడాన్ని కూల్చే ఆలోచన కేసీఆర్‌‌ మదిలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. హెరిటేజ్‌ భవనాన్ని కూల్చకుండా ఖాళీ స్థలంలో టవర్లు నిర్మించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే దీన్ని నిరసిస్తూ ఉస్మానియా ఆస్పత్రి అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. నిజాం కాలంలో కట్టిన ఈ ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.పునరుద్ధరిస్తారో లేక కొత్తగా నిర్మిస్తారో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా ప్రభుత్వం తమ వైఖరి వెల్లడించాలని ఆదేశించింది.