Begin typing your search above and press return to search.
చంద్రబాబు సర్కార్ జీవోపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
By: Tupaki Desk | 15 Oct 2020 6:20 PM ISTచంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోను ఏపీ హైకోర్టు తప్పు పట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు రాష్ట్ర భద్రత కమిషన్ లో ఉన్న స్థానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నాడు జీవో జారీ చేసి తొలగించింది. ఈ జీవోను హైకోర్టు తాజాగా తప్పు పట్టింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర భద్రతా కమిషన్ లో ప్రతిపక్ష నేతకు స్థానం ఉండాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భద్రత కమిషన్ లో ప్రతిపక్ష నేతకు ఉన్న స్థానాన్ని తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవోను సవరించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్ర భద్రతా కమిషన్ లో చోటు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకొని తాజాగా జీవో జారీ చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
2013లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర భద్రతా కమిషన్లను రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. హోంశాఖ మంత్రి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ గా ఉంటారు. ఈ కమిటీలో ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వం నామినేట్ చేసిన ఐదుగురు స్వతంత్ర సభ్యులు ఉంటారు.
అయితే 2018లో నాడు చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను ఈ కమిటీలోంచి తీసివేస్తూ జీవో 42ను జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తాజాగా వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర భద్రత కమిషన్ లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తాజాగా జీవో జారీ చేసేందుకు జగన్ ప్రభుత్వానికి నాలుగువారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.