Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు..

By:  Tupaki Desk   |   29 Sept 2019 10:24 AM IST
చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు..
X
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఓడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల లూప్ హోల్స్ వెతికి మరీ వారిపై హైకోర్టులో పిటీషన్ వేస్తూ వారిపై అనర్హత వేటు వేసేందుకు నడుం బిగించారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు... ఎన్నికల అఫిడవిట్లో టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుడు లెక్కలు చూపారని కోర్టుకెక్కారు. అవి విచారణలో ఉన్నాయి. తాజాగా చంద్రబాబుకు కూడా అలాంటి పరిస్థితియే ఏర్పడింది.

ప్రతిపక్ష నేత - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎన్నికల్లో పోటీచేశారని చంద్రబాబుపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళిపై బోటాబోటీ మెజార్టీతోనే గట్టెక్కారు. అయితే తాజాగా వైసీపీ అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన ఏఎస్ విద్యాసాగర్ రావు పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రజాసేవకుడిగా ఉన్న చంద్రబాబు.. ఆయన సీఎంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాల వివరాలను ఆదాయంలో చూపాలని..కానీ చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో చూపలేదని.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబు ఎన్నిక వివాదం మొదలైంది. ఒకవేళ ఆయన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు చూపించినట్టు రుజువైతే అనర్హత వేటు పడే అవకాశాలుంటాయి.