Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు షాక్

By:  Tupaki Desk   |   13 April 2019 10:08 AM IST
టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు షాక్
X
టీఆర్ ఎస్ పార్టీలోకి మారిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరు టీఆర్ ఎస్ లో చేరడమే కాకుండా కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్ - ఆకుల లలిత - దామోదర్ రెడ్డి - ప్రభాకర్ రావు లకు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు శాసనమండలి చైర్మన్ - కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు అధికార టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై అప్పటి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ రాశారు. దానిని ఆయన ఆమోదించారు. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు - బాలాజీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ మండలి విలీనాన్ని ఆమోదిస్తూ జారీ చేసిన బులెటిన్ చట్టవిరుద్ధమని వారు కోరారు. విలీనం పేరుతో పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు.

దీనిపై స్పందించిన హైకోర్టులు వివరణ ఇవ్వాలని నలుగురు ఎమ్మెల్సీలు - చైర్మన్ - ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.