Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడుకు హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   30 Sept 2019 11:11 AM IST
అచ్చెన్నాయుడుకు హైకోర్టు నోటీసులు
X
ఫైర్ బ్రాండ్ - టీడీపీకి చెందిన సీనియర్ నేత - టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు హైకోర్టు షాకిచ్చింది. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు తాజాగా అచ్చెన్నాయుడు ఎన్నికలో లూప్ హోల్స్ ఉన్నాయని గ్రహించి ఈ పిటీషన్ ను అనుమతించింది.

తాజాగా హైకోర్టు అచ్చెన్నాయుడితోపాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 17లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ - బీజేపీ - జనసేన - ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులతోపాటు టెక్కలి రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు పంపింది.

అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీచేసినప్పుడు అఫిడవిట్ లో తనపై నమోదైన క్రిమినల్ కేసు వివరాలను పేర్కొనలేదని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన తిలక్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2017 - జులై 21న అనంతపురం జిల్లా హీరేహల్ లో క్రిమనల్ కేసు నమోదైందని ఆధారాలు అందజేశారు. అచ్చెన్నపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అభ్యర్థి కోరడంతో ఆయన ఎన్నిక వివాదం రాజుకుంది.