Begin typing your search above and press return to search.
అంగప్రవేశం జరగనంత మాత్రాన అత్యాచారం కాదా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 Feb 2021 3:00 PM ISTమైనర్ బాలికపై పెంపుడు తండ్రి అత్యాచార కేసులో ముంబై హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం అంగప్రవేశం జరగనంత మాత్రాన దాన్ని అత్యాచారంగా పరిగణించకుండా ఉండలేమని సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి పోక్సో కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సమర్థించింది.
ఔరంగాబాద్ జిల్లాలోని పైతాన్ గ్రామానికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు తన దత్తత కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి ముంబై హైకోర్టు మంగళవారం ఈ విచారణ చేపట్టింది.
డిసెంబర్ 16,2016న ఆ బాలిక తల్లి పక్క ఊరిలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లింది. బాలిక, ఆమె తండ్రి మాత్రమే ఆ రోజు ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన 74 ఏళ్ల ఆ వృద్ధుడు రాత్రిపూట తన దత్తత కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నిస్తూ అంగ ప్రవేశం చేయబోయాడు. కానీ సాధ్య పడలేదు. అయినప్పటికీ బాలిక పట్ల లైంగిక దాడిని కొనసాగించాడు.
కొద్దిరోజులకు ఆ బాలిక తన టీచర్లతో ఈ విషయం చెప్పడంతో... వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఆ ఘటన జరిగే నాటికి బాలిక వయసు 14 సంవత్సరాలు. 2019లో పోక్సో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఆ తీర్పును ముంబై హైకోర్టులో వృద్ధుడు సవాల్ చేశాడు. అసలు అత్యాచారమే ఆరోజు జరగలేదని వివరించాడు. అంగప్రవేశం జరగలేదని వాదించాడు.
ఈ పిటీషన్ విచారించిన హైకోర్టు నిందితుడి దుస్తులతోపాటు, బాలిక దుస్తులపై వీర్యపు మరకలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని.. బాధితురాలి జననాంగంలో అంగ ప్రవేశం చేసేందుకు యత్నించడం కూడా అత్యాచారం కిందకే వస్తుందని తీర్పు చెప్పి అతడికి శిక్ష వేసింది.