Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య పై హైకోర్టు కీలక సూచన

By:  Tupaki Desk   |   30 Jan 2020 6:59 AM GMT
వైఎస్ వివేకా హత్య పై హైకోర్టు కీలక సూచన
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఆయన హత్య, తర్వాత పరిణామాలపై నాడు అనుమానం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ సహా వివేకా భార్య, చాలా మంది హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా వైఎస్ వివేకా కూతురు సునీత కూడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ మరో పిటీషన్ దాఖలు చేసింది.

సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో వివేకా హత్య జరిగింది. తాజాగా ప్రభుత్వం మారి వైఎస్ జగన్ సీఎం అయ్యారు. హైకోర్టులో వైఎస్ వివేకా హత్యపై దాఖలైన పిటీషన్లపై గురువారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సంచలన కామెంట్ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 6కు కేసును వాయిదా వేసింది.

ఈ కేసుపై ప్రభుత్వం కూడా తన వాదన వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తుది దశలో ఉందని.. ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరుఫున ఏజీ వాదించారు.

జగన్ సర్కారు నియమించిన సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 62 మందిని విచారించినా నేరస్థులు ఎవరనేది తేలలేదు. దీంతో సీబీఐ కి అప్పగించాలనే డిమాండ్లు పెరిగి పోతున్నాయి.