Begin typing your search above and press return to search.
సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు
By: Tupaki Desk | 9 Sept 2020 11:15 AM ISTతూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్రపతి కూడా సీరియస్ అయ్యి విచారణ చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ కూడా దీనిపై సీరియస్ గా ముందుకెళుతోంది.
తాజాగా ఈ శిరోముండనం కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఆరుగురు నిందితులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరుతూ విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేశారు.
వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతడి అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్రపతి కూడా స్పందించి సామాజికన్యాయశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఈ కేసులో బాధితుడు ప్రసాద్ చెప్పేవన్నీ అబద్దాలు అని ప్రమాదంలో గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించాడు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి అక్టోబర్ 5కు వాయిదా వేసింది.