Begin typing your search above and press return to search.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీపై హైకోర్టు తీర్పు
By: Tupaki Desk | 13 March 2021 8:28 AM ISTహైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికలపై వేసిన పీటీషన్ ను కొట్టివేసింది. సొసైటీ బైలాస్‌లోని రూల్ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని బొల్లినేని రవీంధ్రనాథ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. నోటిఫికేషన్ విడుదలైనందున పిటిషన్ విచారణార్హం కాదన్న అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదనకే ఓకే చెప్పింది. ఈ మేరకు పిటీషన్ ను కొట్టివేసింది. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారమే కమిషనర్ వ్యవహరించారని స్పష్టం చేశారు.
మెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు గెలుస్తారని, పోటీ చేసే అవకాశం అందరికీ ఉండాలన్నదే సొసైటీ ఉద్దేశమని సొసైటీ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. ఎన్నికల ప్రక్రియను సవాల్ చేయడం లేదని, నోటిఫికేషన్ కంటే ముందు ఇచ్చిన కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను మాత్రమే కొట్టేయాలని పిటిషనర్ తరుఫున వాదించారు.
అయితే పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రొసీడింగ్స్ కొట్టేయాలన్న మధ్యంతర దరఖాస్తు కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. సభ్యుల పోటీపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలక్షన్ పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది.