Begin typing your search above and press return to search.
ఆవు ఆక్సిజన్ ఇస్తుందన్న హైకోర్టు జడ్జి
By: Tupaki Desk | 5 Sept 2021 5:00 AM ISTఅలహాబాద్ హైకోర్టు జడ్జి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘ఆవును జాతీయ జంతువు’గా ప్రకటించిన ఇటీవల వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరో మారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నయం అవుతాయని హైకోర్టు జడ్జి తెలిపారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని.. బెయిల్ ఇస్తే మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడుతాడని వ్యాఖ్యానిస్తూ అతడికి హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్ బెయిల్ నిరాకరించారు.
హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటున్నారని అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకం అని హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు.