Begin typing your search above and press return to search.

దిశ ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   9 Dec 2019 1:06 PM GMT
దిశ ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక నిర్ణయం
X
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దిశ నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులకు హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు మృతదేహాలను భద్రపరచాలని విచారణ జరిపేవరకూ ఆపాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో కూడా నిందితుల అంత్యక్రియలకు బ్రేక్ పడింది. దీనిపై హైకోర్టు, మానవ హక్కుల విచారణ సందర్భంగానే సుప్రీం కోర్టులో కూడా పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

సోమవారం హైకోర్టులో దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పిటీషన్ విచారణకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో ఈ పిటీషన్ బుధవారం విచారణ కు రానున్న నేపథ్యంలో తాము దీన్ని గురువారం విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం వాయిదావేసింది.

ఈ నిర్ణయంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలన్న పోలీసుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇక తమ వారిని కడసారి చూసుకుందామని భావించిన నలుగురు నిందితుల కుటుంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు, మానవ హక్కుల సంఘాల విచారణలో జాప్యం కారణంగా నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు మరింత జాప్యం కానున్నాయి. ప్రస్తుతం ఈ మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ ఆస్పత్రిలో సరైన వసతులు లేవు. అందుకే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి శవాలను తరలిస్తున్నారు. ఇక్కడ మృతదేహాలను భద్రపరిచి విచారణ అనంతరం వీరి అంత్యక్రియలు జరుపనున్నారు. అది ఎప్పుడు ముగుస్తుందనేది చెప్పలేని పరిస్థితి ఉంది.