Begin typing your search above and press return to search.
పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు విచారణ
By: Tupaki Desk | 28 Jan 2021 3:16 PM ISTపంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు శుక్రవారానికి వీటిని వాయిదా వేసింది. గురువారం విచారించిన హైకోర్టు ఏపీలో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఈ సమయంలో తాము జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉందా? అని ఏజీని ప్రశ్నించింది.
పంచాయితీ ఎన్నికలను 2019 ఓటరు జాబితాతో నిర్వహించడంపై అభ్యంతరం తెలుపుతూ యువ ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారని.. 3 లక్షలకు పైగా ఓటర్లు ఓటు వేయలేకపోతున్నారని గుంటూరుకు చెందిన అఖిల హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈ పిటీషన్ పై తాము డివిజన్ బెంచ్ కు వెళ్తామని పిటీషనర్ తరుఫు న్యాయవాది కోరారు. పిటీషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు. దీంతో ఈ పిటీషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.ఎన్నికల సమయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. కేంద్ర న్యాయవాది, అడ్వకేట్ జనరల్ సూచించడంతో హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. స్టే ఇవ్వలేదు.