Begin typing your search above and press return to search.

ఏపీలో మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   2 Sept 2020 12:30 PM IST
ఏపీలో మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్
X
ఏపీలోని మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యానికి సంబంధించి దాఖలైన పిటీషన్ లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చుకోవడంపై కీలక తీర్పును ఏపీ హైకోర్టు ఇచ్చింది. జీవో నంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిళ్లు తీసుకొని రావచ్చని స్పష్టం చేసింది. ఈ జీవోను ఏపీ పోలీసులు అమలు చేయాలని సూచించింది.హైకోర్టు తీర్పు మందుబాబులకు ఊరటనిచ్చింది. దీనిపై తీర్పును రిజర్వు చేసింది.

కాగా జీవోనెంబర్ 411 ప్రకారం ఏపీలో మద్యాన్ని తీసుకొని వచ్చే వెసులు బాటు ఉంది.అయినప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు ఏపీ హైకోర్టు వ్యాజ్యం వేశారు.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

ఇప్పటివరకు దాఖలైన అనేక కేసుల్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.