Begin typing your search above and press return to search.
అచ్చెన్నకి హైకోర్టు షాక్ .. బెయిల్ పిటిషన్ కొట్టివేత !
By: Tupaki Desk | 29 July 2020 2:20 PM ISTటీడీపీ సీనియర్ నేత , టీడీపీ శాసనసభా పక్ష నేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ పిటీషన్ విషయంలో ఆయనకు కోర్టులో చుక్కెదురైంది. ఈఎస్ఐ కుంభకోణం కేసు లో బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటీషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసుపై విచారణ కొనసాగుతోన్న సమయంలో బెయిల్ మంజూరు చేయడం పద్దతి కాదు అని అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది చేసిన వాదనలను పరిణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు అచ్చెన్న బెయిల్ పిటీషన్ ను కొట్టేసింది.
అలాగే ఏ1 రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. అరెస్ట్ అయ్యే సమయానికి ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తో హైకోర్టు అతన్ని గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆయన రమేష్ ఆస్పత్రి లో ఉన్నారు. ఈ కేసులో పలుమార్లు అధికారులు విచారణ కూడా చేశారు. . కాగా, ఈఎస్ ఐ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న అభియోగాల పై పోలీసులు జూన్ 12వ తేదీన అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తరువాత, మొదట ఏసీబీ కోర్టు లో బెయిల్ కోసం ఆశ్రయించాడు. అక్కడ బెయిల్ రాకపోవడంతో హైకోర్టు ను ఆశ్రయించాడు. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టు లో వాదనలు ముగియ గా తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది.