Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఫైర్

By:  Tupaki Desk   |   31 Dec 2020 3:02 PM IST
న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఫైర్
X
ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా స్ట్రెయిన్ భయపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్ సహా కొన్ని దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర , రాజస్థాన్ రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలను నిషేధించాయి.

అయితే నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయకపోవడం.. పబ్ లు, బార్లకు అనుమతులు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది.

తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకొని హైకోర్టు ఈ కేసును విచారించింది. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిషేధించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త వైరస్ చాలా ప్రమాదకరమని ఓవైపు కేంద్ర పబ్లిక్ హెల్త్ కమిషన్ చెబుతుంటే.. తెలంగాణలో వేడుకలకు ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు అడిగింది. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది.

అయితే కరోనాను దృష్టిలో ఉంచుకొని వేడుకలు జరుపవద్దని ప్రజలకు సూచించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి 7న సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.