Begin typing your search above and press return to search.

ప్రభుత్వం వల్ల కాదు ..ఆర్టీసీ సమ్మె పై హైకోర్ట్ కామెంట్స్ !

By:  Tupaki Desk   |   27 Nov 2019 5:13 AM GMT
ప్రభుత్వం వల్ల కాదు ..ఆర్టీసీ సమ్మె పై హైకోర్ట్ కామెంట్స్  !
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కి ముగింపు ఎప్పుడు? సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఇక ఆర్టీసీ కథ కంచికేనా ? కార్మికులు వి ఆర్ ఎస్ తీసుకోవాల్సిందేనా? అసలు సమ్మె ఇన్ని రోజులు చేసినా ఫలితం లేక పోవడానికి కారణం ఏంటి ? హైకోర్టు లో విచారణ జరిగిన ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు ? ఇలా ఆర్టీసీ సమ్మె పై అనేక రకాలైన ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. దాదాపుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి రెండు నెలలు కావొస్తుంది. కానీ , ఈ సమ్మె పై ప్రభుత్వం లో ఇసుమంతైనా స్పందన కనిపించక పోవడం తో చేసేదేమిలేక కార్మికులు సమ్మె ని విరమించారు.

కానీ , ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినప్పుడు సమ్మె చేయడానికి ,. ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతాం అనడానికి ఏదేమైనా మీ అయ్యా గారి జాగీరా అంటూ ..వారిని విధుల్లోకి తీసుకోలేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా నిందించలేము. ఎందుకు అంటే ప్రభుత్వం రెండు సార్లు కార్మికులకు అవకాశం ఇచ్చిన తరువాతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది. జేఏసీ నేతల మాటలు విని అనవసరంగా సమ్మె చేశామా అని ఇప్పుడు కొందరు కార్మికులు భాద పడుతున్నారు.

ఇకపోతే ఈ సమ్మె జరుగుతున్న సమయం లో కొంతమంది కార్మికులు ఆత్మ హత్యలకి పాల్పడ్డారు. దీనితో ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకున్నారు అంటూ పిటిషన్ వేయడం తో ...ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల ఆత్మ హత్యలు చేసుకోవడానికి, గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉండి ఉంటాయని, ప్రభుత్వం వల్ల ఆర్టీసీ కార్మికులు చనిపోయారు అనటానికి ప్రూఫ్ ఏంటి అని పిటిషనర్ ను ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ ఆర్టీసీ కార్మికులు మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లను ధర్మాసనం కి అందించారు.

దీని పై ధర్మాసనం .. సీఎం కేసీఆర్ ఉద్యోగులని తొలగిస్తున్నట్టు చెప్పినా ..ఎక్కడా కూడా దాని పైన జీవో విడుదల కాలేదు అని తెలిపింది. ప్రభుత్వానికి కార్మికుల ఆత్మ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు. అలాగే సమ్మె చేయడానికి ముందుకు వచ్చింది జేఏసీ నేతలు ..సమ్మె చేసింది కార్మికులు కాబట్టి ..కార్మికుల ఆత్మ హత్యలకి కూడా జేఏసీ నేతలే భాద్యత వహించాలి అంటూ తెలిపింది. ఇక సమ్మె విరమించి విధుల్లోకి చేరతాం అని చెప్తున్నా కూడా ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్తాపం తో కొంతమంది ఆత్మహత్యలకి పాల్పడే అవకాశం ఉంది అని పిటిషనర్ తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ డిపోల్లోకి అనుమతించక పోవడం పై మరో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. అలాగే ఈ కేసు విచారణని 28వ తేదీకి వాయిదా వేసింది.