Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : గణేష్ ఉత్సవాల పై హైకోర్టు ఆంక్షలు
By: Tupaki Desk | 9 Sept 2021 12:00 PM ISTతెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని తెలిపింది. హుస్సేన్ సాగర్ లో ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచనలు చేసింది. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని, లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు సూచించింది. అలాగే గణేష్ మండపాల వద్ద ఎక్కువమంది , ఎక్కువ సేపు గుమ్మిగూడకుండా చూడాలని తెలిపింది.
నిన్న గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్న తమ ఆదేశాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం సమయంలో ఆంక్షలు, నియంత్రణల చర్యలపై తామిచ్చే ఆదేశాలను చూపించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే చేద్దామని భావించినా..ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. జల, వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుందని వ్యాఖ్యానించింది. నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక సమర్పించే తీరిక కూడా లేనట్టుందంటూ మండిపడింది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో చేసిన భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారుతోందని, వీటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఇచి్చన సూచనల అమలు బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. కరోనా, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వినాయక మండపాల ఏర్పాటు సమయంలో గుమిగూడకుండా, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇచి్చన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ మేరకు ఈ రోజు తీర్పు వెల్లడించింది.