Begin typing your search above and press return to search.

ఫ్యూజ‌న్ ఫుడ్స్ ను అక్క‌డే పెట్టించండి..కోర్టు ఆర్డ‌ర్!

By:  Tupaki Desk   |   18 Sep 2021 3:35 AM GMT
ఫ్యూజ‌న్ ఫుడ్స్ ను అక్క‌డే పెట్టించండి..కోర్టు ఆర్డ‌ర్!
X
ఏపీ రాజ‌కీయంలో ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ పేరు చాన్నాళ్లుగానే వినిపిస్తూ ఉంది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై వైజాగ్ ఎయిర్ పోర్టులో జ‌రిగిన దాడి ద‌గ్గ‌ర నుంచి ఈ రెస్టారెంట్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. జ‌గ‌న్ పై దాడికి పాల్ప‌డిన జే శ్రీనివాస‌రావు ఈ రెస్టారెంట్లోనే ప‌ని చేసేవాడు కావ‌డంతో.. దీని పుట్ట‌పూర్వోత్త‌రాలు తెర‌పైకి వ‌చ్చాయి. తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రుల‌ది ఈ రెస్టారెంట్ అనే పేరు వ‌చ్చింది. ఇక జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫ్యూజ‌న్ రెస్టారెంట్ కు సంబంధించి వివాదాలు రేగాయి.

విశాఖ‌ప‌ట్నం సిరిపురం జంక్ష‌న్ లోని ఫ్యూజ‌న్ ఫుడ్స్ ప్ర‌ధాన రెస్టారెంట్ ను విశాఖ మెట్రొపాలిట‌న్ రీజ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ మూసి వేయించింది. ఇది నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన నిర్మాణం అంటూ రెస్టారెంట్ ను అక్క‌డ నుంచి తీసి వేశారు. దీని ప్ర‌మోట‌ర్లు లైసెన్స్ అగ్రిమెంట్ల‌ను కూడా ఉల్లంఘించార‌ని అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అప్ప‌ట్లో ఇది వార్త‌ల్లో నిలిచింది. ఇది త‌మ‌పై దాడి అంటూ తెలుగుదేశం నేత‌లు ఆరోపించారు.

ఈ అంశంపై వారు కోర్టును ఆశ్ర‌యించారు. ఇప్ప‌టికే సింగిల్ జ‌డ్జి బెంచ్ ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టి, ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ రెస్టారెంట్ ను అక్క‌డ నుంచి తొల‌గించ‌డం స‌రికాద‌ని సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై ప్ర‌భుత్వం అప్పీల్ కు వెళ్లింది. డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించింది. అయితే డివిజన్ బెంచ్ లో కూడా కింది కోర్టు తీర్పే వ‌చ్చింది.

ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ ను య‌థాస్థానంలో ఉంచుకోవ‌డానికి అనుమ‌తిని ఇవ్వాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. రెస్టారెంట్ ను అక్క‌డ నుంచి తొల‌గించ‌డం స‌రికాద‌ని కూడా కోర్టు పేర్కొంది.