Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డికి హై కమాండ్ వార్నింగ్ ...?

By:  Tupaki Desk   |   16 Aug 2022 12:31 PM GMT
కోమటిరెడ్డికి హై కమాండ్ వార్నింగ్ ...?
X
పార్టీయే ఎపుడూ గొప్పది. దానికి మించి ఎవరైనా ఎగస్ట్రాలు చేస్తే ఎవరూ ఊరుకోరు. అయితే శతాధిక వృద్ధ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో కాస్తా ఉదారంగా ఉంటుంది. అయితే శృతి మించితే మాత్రం ఊరుకునేది లేదు అని ఇటీవల రోజులలో బాగానే హెచ్చరిస్తోంది. ఇపుడు హై కమాండ్ ఫైనల్ వార్నింగ్ రుచి ఏంటో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు.

తాను ఉంటే తప్ప మునుగోడులో కాంగ్రెస్ కి మనుగడ లేనే లేదని కోమటిరెడ్డి అనుకుంటున్నారు. అయితే ఆయన ఇక్కడ ఒక విషయం మరచిపోతున్నారు. తల్లి లాంటి పార్టీని పక్కన పెట్టి బీజేపీ నీడన చేరింది సొంత తమ్ముడు రాజగోపల్ రెడ్డి అని. దాంతో సహజంగానే ఆయన మీద వత్తిడి ఉంటుంది. ఒక విధంగా శీల పరీక్షకు గురి అవాల్సిన వెంకటరెడ్డి రివర్స్ లో పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు అని అంటున్నారు.

పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటూ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు అద్దకి దయాకర్ చుండూరు సభలో కోమటిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దాని మీద ఫైర్ అయిన కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. దానికి కొంత తగ్గి మరీ రేవంత్ రెడ్డి ఆయనకు సారీ చెప్పారు. ఇక అద్దంకి దయాకర్ కూడా సారీ చెప్పినా కోమటిరెడ్డి వినకుండా కాస్తా అతి చేస్తున్నారు అని అంటున్నారు.

ఈ విషయాలు అన్నీ కూడా హై కమాండ్ దృష్టిలోకి వెళ్లాయట. దాంతో హై కమాండ్ కూడా ఆయన్ని లైట్ తీసుకుంది అని అంటున్నారు. ఎటూ ఆయన తమ్ముడికే ఓటేస్తారు అని అనుమానిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఆయన్ని అలా వదిలేయడమే బెటర్ అని అంటున్నారుట. మునుగోడులో పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించకూడదని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

ఇక తనను పార్టీ నుంచి బయటకు పంపిస్తే భారీ సానుభూతి పొందాలని వెంకటరెడ్డి చూస్తున్నారుట. అయితే హై కమాండ్ మాత్రం అలా కాకుండా ఆయన్ని పార్టీలో ఉంచినా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుడా సైడ్ చేయలాని మరో ఎత్తు వేసిందని అంటున్నారు. దాంతో కోమటిరెడ్డికే చాయిస్ వదిలేసి ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో నీ ఇష్టం అన్న తరహాలో హై కమాండ్ వ్యవహరిస్తుంది అని చెబుతున్నారు. మొత్తానికి వెంకటరెడ్డి ఇపుడు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు. ఆయన ఏం చేస్తారో చూడాలి మరి.