Begin typing your search above and press return to search.

పేరుకి వెల్ నెస్ సెంటర్ ..లోపల మాత్రం ఆ వ్యవహారం ..ఏంటంటే ?

By:  Tupaki Desk   |   26 Jun 2020 1:00 PM IST
పేరుకి వెల్ నెస్ సెంటర్ ..లోపల మాత్రం ఆ వ్యవహారం ..ఏంటంటే ?
X
ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటుగా మనదేశం కూడా ఈ మహమ్మారితో పోరాడుతుంది. దీనిపై విజయం సాధించాలి అంటే భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. దీన్ని అందరూ పాటిస్తున్నారు. కానీ , కొంతమంది మాత్రం ఈ క్లిష్ట సమయంలో కూడా వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా ఆడవాళ్ల శరీరాలతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మరి కొందరు. జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవని వెల్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వెల్ నెస్ సెంటర్ పేరుతో లోకాంటో వెబ్ సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు.

ఈ విషయాన్ని తాజాగా పోలీసులు బయటపెట్టారు. దీన్ని నిర్వహిస్తున్న జంటతో పాటు నలుగురు యువతులు, ఇద్దరు విటులను కూడా అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్ వెంకటగిరి ప్రాంతంలో శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవని వెల్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దీన్ని వ్యభిచార కేంద్రంగా మార్చి దందా సాగిస్తున్నారు.బ్రోకర్ల సాయంతో వీరు ఉత్తరాది నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

చాలా రోజులుగా ఈ సంస్థపై అనుమానాలు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. గురువారం మెరుపుదాడి చేయడంతో గుట్టు రట్టైంది. నిర్వాహకురాలు శైలజతో సహా నలుగురు మహిళలను, ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె భర్త భర్త పరమేశ్వరన్ పారిపోవడంతో అతని కోసం గాలిస్తున్నారు. కాగా శైలజ ఈ దందాలో తనకు సాయంగా గద్వాలకు చెందిన చందా వనజశ్రీ అనే మహిళను కూడా నియమించుకున్నట్టుగా పోలీసులు తేల్చారు.