Begin typing your search above and press return to search.

అడ్డంగా బుక్కైన 'వకీల్ సాబ్' .. ఏంచేశాడంటే ?

By:  Tupaki Desk   |   1 May 2021 1:00 PM IST
అడ్డంగా బుక్కైన వకీల్ సాబ్ .. ఏంచేశాడంటే ?
X
కోర్టు..ఓ దేవాలయం లాంటిది. ఎన్నో కేసుల్లో నిజానిజాలు తెలిసేది అక్కడే. ఎంతోమంది దోషులకు శిక్షలు పడేది అక్కడే. కోర్టులో చిన్నా , పెద్ద ,పేద , ధనిక అన్న తేడా ఏముండదు. ఏం నేరం చేశారో నిరూపితం అయితే న్యాయవ్యవస్థ లో ఉన్న విదంగా శిక్షింపబడతారు. అలాంటి పవిత్రమైన కోర్టులో ఓ లాయర్ తడబడ్డాడు. సాధరణంగా లాయర్లు తడబడే టైపు కాదు. కేసు వాదించే సమయంలో ఇతరులనే తడబాటుకు గురి చేసే వ్యక్తులు. కానీ, ఓ లాయర్ కోర్టులో మాట్లాడుతూ తడబడ్డాడు. దీనితో అనుమానం తో న్యాయమూర్తి అతని గురించి పూర్తి వివరాలు ఆరా తీస్తే .. అయన నిజమైన వకీల్ కాదని నకిలీ వకీల్ సాబ్ అని బయటపడింది. పవిత్రమైన కోర్టులో నకిలీ వకీల్ సాబ్ అవతారం ఎత్తి , ఇద్దరు వ్యక్తుల బెయిల్‌ పిటిషన్‌ వాదించడానికి వచ్చిన తానే కటకటాలపాలయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. విశాఖ జిల్లా అనకాపల్లిలో న్యాయస్థానానికి విశాఖ డాబాగార్డెన్స్‌కు చెందిన సంపంగి చినబంగారి దుర్గా సురేష్‌ కుమార్‌ వకీల్ సాబ్ లా నల్లకోటు వేసుకొని అనకాపల్లి 11వ మెట్రోపాలిటన్‌ జడ్జి ఎస్‌.విజయచందర్‌ ముందు గురువారం బెయిల్‌ పత్రాలు దాఖలు చేశాడు. ఆ బెయిల్ అప్లై చేసే సమయంలో కోర్టు అడిగే ప్రశ్నలకి కొంచెం తడబాటుకు గురి అవుతుండటంతో న్యాయమూర్తికి అతని పై అనుమానం కలిగింది. దీనితో న్యాయమూర్తి అతని పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. ఆ ఊహించని ప్రశ్న తో ఏం చేయాలో తెలియక ,అక్కడి నుండి ఉడాయించే ప్రయత్నం చేశాడు. దీనితో వెంటనే అక్కడ ఉన్న న్యాయవాదులు అతన్ని పట్టుకున్నారు. సురేష్‌ కుమార్‌ వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలిస్తే దానిపై టి.దేవేందర్‌ అనే అడ్వకేట్‌ పేరు ఉండగా, ఫొటో మాత్రం సురేష్‌ కుమార్‌ ది ఉంది.దీనితో న్యాయమూర్తి కోర్టు సూపరింటెండెంట్‌ను పిలిచి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నకిలీ వకీల్‌ సాబ్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు శుక్రవారం ప్రవేశపెట్టగా, 14 రోజులు రిమాండ్‌ విధించారు.