Begin typing your search above and press return to search.

3500 కోట్ల విలువ గ‌ల హెరాయిన్ సీజ్‌!

By:  Tupaki Desk   |   30 July 2017 10:34 AM GMT
3500 కోట్ల విలువ గ‌ల హెరాయిన్ సీజ్‌!
X
హైద‌రాబాద్ లో బ‌య‌ట‌ప‌డ్డ డ్ర‌గ్స్ రాకెట్ రాష్ట్రంతోపాటు దేశ‌వ్యాప్తంగా సంచల‌నే రేపిన సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు - పోలీసులు ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌డుతున్న‌ప్ప‌టికీ గంజాలు - డ్ర‌గ్స్ ర‌వాణా కోసం ముఠాలు కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నాయి. డ్ర‌గ్స్ ముఠాల ఆట‌క‌ట్టించేందుకు అధికారులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రాంతాల‌లో త‌నిఖీలు చేస్తున్నారు. తాజాగా గుజ‌రాత్‌ లో 1500 కిలోల హెరాయిన్ ను నావికా ద‌ళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ. 3500 కోట్ల విలువ ఉంటుందని అంచ‌నా.

గుజ‌రాత్ లో ఇండియ‌న్ నేవీ అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్ ఆట క‌ట్టించారు. గుజరాత్ తీరంలో ఓ వ్యాపారికి చెందిన దాదాపు 1500 కిలోగ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి ఓడలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. చాక‌చ‌క్యంగా వారిపై దాడి చేసి డ్రగ్స్ ను సీజ్ చేశారు. వారు స్వాధీనం చేసుకున్న‌ హెరాయిన్ విలువ దాదాపు రూ. 3500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ సీజ్ చేసిన డ్రగ్స్ కేసుల్లో ఇదే అతిపెద్దదని అధికారులు చెబుతున్నారు.

ఆ ఓడ‌లో హెరాయిన్ ర‌వానా చేస్తున్నార‌ని నిఘా అధికారులకు ప‌క్కా సమాచారం అందింది. నిఘా వ‌ర్గాల ఇచ్చిన వివరాల ప్ర‌కారం ఇండియ‌న్ నేవీ అధికారులు....డ్రగ్స్ ముఠాపై ఆకస్మిక దాడి చేశారు. మొత్తం ఒకటిన్నర టన్నుల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. భారీ స్థాయిలో హెరాయిన్ ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. ప్రస్తుతం నావికాదళం - నిఘా - పోలీసు - కస్టమ్స్ విభాగాల అధికారులు ఈ భారీ డ్రగ్స్ రాకెట్ రవాణాపై విచారణ చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఎంత మందిని అరెస్ట్ చేశారు, త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.