Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ - జాతకం.. సుమన్ కామెంట్

By:  Tupaki Desk   |   27 Aug 2018 10:06 AM IST
పవన్ కళ్యాణ్ - జాతకం.. సుమన్ కామెంట్
X
టాలీవుడ్ యాక్టర్ సుమన్.. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడపై హాట్ కామెంట్స్ చేశారు. సుమన్ సినిమా రంగంలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనతో పలు న్యూస్ చానెళ్లు చిట్ చాట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

హీరోగా ఇండస్ట్రీని ఏలి ఇప్పుడు జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సుమన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయని.. ముఖ్యంగా యువతలో పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్నారు. పవన్ ను చాలా మంది యువత ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు.

తాను చిన్నప్పటి నుంచి జాతకాలను నమ్ముతానని.. జాతకం బాగుంటే పవన్ కూడా రాజకీయాల్లో రాణిస్తాడని సుమన్ కామెంట్ చేశాడు. పవన్ జాతక రీత్యా ఎలా ఉందో తెలియదని.. రాశులన్నీ బాగుంటే మాత్రం గొప్ప స్థానానికి వెళుతాడని అన్నాడు.

కాగా సుమన్ మాట్లాడిన మాటలపై చాలామంది సెటైర్లు వేస్తున్నారు. జాతకాలు బాగున్నంత మాత్రాన రాజకీయాల్లో సక్సెస్ అవుతురాన్న సుమన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అనేది కష్టపడితేనే వస్తుందని.. జాతకాలు బాగున్నంత మాత్రాన పనిచేయకున్నా సక్సెస్ రాదని స్పష్టం చేస్తున్నారు. ఇలా జాతకాలతో అధికారం వస్తే రాజకీయ పార్టీలన్నీ మహర్జాతకులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే సరిపోతుంది కదా అని విమర్శిస్తున్నారు. జాతకాలకు ప్రజాభిమానానికి పొంతన లేదని సోషల్ మీడియాలో సెటైర్ వేస్తున్నారు.