Begin typing your search above and press return to search.

చంద్రబాబు కన్నా ఆ నటుడే గొప్ప నాయకుడట!

By:  Tupaki Desk   |   2 Aug 2019 10:28 AM IST
చంద్రబాబు కన్నా ఆ నటుడే గొప్ప నాయకుడట!
X
మిగతా విషయాల్లో ఏమో కానీ తన గురించి తను చాలా ఎక్కువగా చెప్పుకోవడంలో చంద్రబాబును మించి పోతున్నట్టుగా ఉన్నాడు నటుడు శివాజీ. ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి మరీ కామెడీగా చెప్పుకున్నాడు శివాజీ. తనను తాను గొప్ప నాయకుడిగా అభివర్ణించుకున్నాడు ఆయన. చంద్రబాబు కంటే తను పెద్ద నేతను అని శివాజీ చెప్పుకోవడం గమనార్హం.

శివాజీ ఎవరు? అంటూ.. చంద్రబాబు నాయుడి భజన పరుడు - చంద్రబాబు అవసరం అయినట్టుగా ఆడే వ్యక్తి అనే ప్రచారం ఉంది జనాల్లో. చంద్రబాబు నాయుడు రాజకీయానికి అనుగుణంగా తెలుగుదేశం బయట ఉన్న కొంతమంది వ్యక్తులు రకరకాల డ్రామాలు నెరుపుతూ ఉంటారని - ఆ ట్రూపులో శివాజీ ఒకరు అని జనాలు అంటూ ఉంటారు.

మరి అలాంటి శివాజీ ఇప్పుడు చంద్రబాబు కన్నా తనే గొప్ప అని చెప్పుకోవడం కామెడీగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. తను అనుకుంటే చంద్రబాబు కన్నా గొప్పగా రాజకీయం చేయగలనంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. తను అనుకుంటే చంద్రబాబు స్థాయిని మించి ఎదిగిపోతానంటూ వివరించాడు. తనకు కులపిచ్చి లేదని - తనకు కుల పిచ్చి ఉంటే చంద్రబాబు నాయుడును మించి పోయేవాడిని అని చెప్పుకున్నాడు శివాజీ.

తనకు దేవుడు చాలా తెలివితేటలు ఇచ్చాడని - వాటిని రాజకీయంలో ఉపయోగించుకుంటే.. తనకు తిరుగులేదని చెప్పుకొచ్చాడు. తను రాజకీయాలు చేస్తూ ఎవరూ తట్టుకోలేరని కూడా ప్రస్తుత నేతలకు శివాజీ హెచ్చరిక జారీ చేయడం విశేషం.

మొత్తానికి సినిమాల్లో చేసిన కామెడీతో శివాజీ ప్రేక్షకులను నవ్వించాడని - ఇప్పుడు సినిమా అవకాశాలు లేకుండా పోయిన నేపథ్యంలో ఇలాంటి ఇంటర్వ్యూలతో కామెడీని పంచుతున్నాడని ఈ నటుడి గురించి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.