Begin typing your search above and press return to search.

హీరో రాజశేఖర్ కారు కు ప్రమాదం.. స్వల్ప గాయాలు?

By:  Tupaki Desk   |   13 Nov 2019 3:32 AM GMT
హీరో రాజశేఖర్ కారు కు ప్రమాదం.. స్వల్ప గాయాలు?
X
ప్రముఖ టాలీవుడ్ హీరో రాజశేఖర్ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితం గా బయట పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ దుర్ఘటన లో రాజశేఖర్ కు చిన్నపాటి గాయాలు అయినట్లు గా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ లోని ఔటర్ రింగు రోడ్డు వద్ద తాజా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ నుంచి హైదరాబాద్ కు తన కారు లో రాజశేఖర్ వస్తున్నారని.. ఆ సమయం లోనే ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు గా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజశేఖర్ కారు టైరు పగిలి పోవటంతో కారు అదుపు తప్పిందని.. డివైడర్ ను ఢీ కొట్టి.. పల్టీ కొట్టిందని చెబుతున్నారు.

ప్రమాద వేళ కారు లోని ఎయిర్ బ్యాగ్స్ సకాలం లో తెరుచుకోవటం తో పెను ప్రమాదం నుంచి రాజశేఖర్ సురక్షితం గా బయట పడ్డారని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయం లో కారు లో రాజశేఖర్ తో పాటు మరొకరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత వేరే కారు లో రాజశేఖర్ వెళ్లిపోయినట్లు గా తెలుస్తోంది.

ఈ ప్రమాదం లో రాజశేఖర్ కు స్వల్పంగా గాయాలు అయినట్లు గా సమాచారం. అయితే.. రాజశేఖర్ తో పాటు ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందన్న దాని పై మాత్రం స్పష్టత రావట్లేదు. ఇదిలా ఉండ గా.. రెండేళ్ల క్రితం హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే లో రోడ్డు యాక్సిడెంట్ చేశారు రాజశేఖర్. తాను ప్రయాణిస్తున్న కారు ను మరో వాహనాన్ని ఢీ కొట్టటం తో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. సదరు కారు యజమాని రామిరెడ్డి తో వివాదాన్ని పరిష్కరించుకోవటం తో పోలీసు కేసు నమోదు కాలేదు. ఏమైనా తాజా ప్రమాదం పెద్దదే అయినా.. ఎయిర్ బ్యాగ్స్.. సీటు బెల్ట్ పెట్టు కోవటం వల్ల చిన్న గాయాల తో రాజశేఖర్ బయటపడినట్లు గా తెలుస్తోంది.